పంచాయతీ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఎక్కువ స్థానాలు కావడానికి ప్రధాన కారణం వాలంటీర్ల అనే వ్యాఖ్యలు గత కొంతకాలంగా విపక్షాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఎక్కువగా ఆరోపణలు చేస్తున్నాయి. అయితే ఇప్పుడు వాలంటీర్ల విషయంలో ముఖ్యమంత్రి జగన్ కు నివేదికలను కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని కొంతమంది అంటున్నారు. ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలను అమలు సమర్థవంతంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సరే తమకు ఓటు వేయకపోతే సంక్షేమ కార్యక్రమాలు వచ్చే అవకాశం ఉండదని ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా బెదిరిస్తుంది అని ఆరోపణలు వినపడుతున్నాయి.
మున్సిపల్ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు... స్థానిక సంస్థలు కాబట్టి వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. కానీ సార్వత్రిక ఎన్నికల్లో ఇలాగే బెదిరిస్తే మాత్రం పరిస్థితి మరోలా ఉంటుంది. సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రభుత్వం మారిపోతుంది కాబట్టి కొత్త ప్రభుత్వం నుంచి కొన్ని సంక్షేమ కార్యక్రమాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు వాలంటీర్ల విషయంలో జగన్ జాగ్రత్తగా లేకపోతే మాత్రం భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. వైసీపీ నేతలు ఎమ్మెల్యేలు మంత్రులు వంటి వాళ్ళు అందరూ కూడా వాలంటీర్లను అన్ని విధాలుగా వాడుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీని మీద జగన్ జాగ్రత్తగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.