మొత్తానికి టీడీఎల్పీని అధికార టీఆర్ఎస్ లో విలీనం చేయటంలో కీలకపాత్ర పోషించినందుకు ఎంఎల్ఏ సండ్ర వెంకటవీరయ్యకు మంచి బహుమతే దక్కబోతోందని టాక్. తెలంగాణా అసెంబ్లీలో టీడీపీని లేకుండా చేయాలని టీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీయార్ చాలా ప్రయత్నాలే చేశారు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయనవల్ల కాలేదు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ తరపున సత్తుపల్లి ఎంఎల్ఏగా సండ్ర వెంకటవీరయ్య, అశ్వారావుపేట ఎంఎల్ఏగా మెచ్చా నాగేశ్వరరావు గెలిచారు.  కేసీయార్ ప్రభుత్వాన్ని పడగొట్టడమే టార్గెట్ గా చంద్రబాబునాయుడు పావులు కదిపిన విషయం తెలిసిందే. అయితే ఆ వ్యూహం ఫెయిలై ఓటుకునోటు కేసుగా దేశంలో సంచలనం సృష్టించింది. ఆ కేసులో సండ్ర కూడా చాలా కీలకమైన వ్యక్తే. అయనపై విచారణ జరుగుతోంది. కొద్దిరోజులు రిమాండులో ఉండి ప్రస్తుతం బెయిల్ పై బయటున్నారు.




అంతటి కీలక వ్యక్తిని కూడా టీఆర్ఎస్ లో చేర్చుకోవటానికి కేసీయార్ సిద్ధపడ్డారు. అయితే అధికారపార్టీలోకి వస్తే ఇద్దరు ఎంఎల్ఏలు రావాల్సిందే అని కేసీయార్ షరతువిధించారు. దాంతో టీఆర్ఎస్ లో సండ్ర చేరిక ఎప్పటికప్పుడు వాయిదా మీద వాయిదా పడుతోంది. తనతో పాటు మెచ్చాను కూడా టీఆర్ఎస్ లోకి తీసుకురావటం కోసం సండ్రమీద బాగా ఒత్తిడి పెరిగిపోయింది. మొత్తానికి మెచ్చా వెంట సండ్ర పడిన కారణంగా చివరకు మెచ్చాకూడా టీడీపీలో నుండి బయటకు వచ్చేయటానికి ఓకే చెప్పారు. దాంతో సండ్ర, మెచ్చా ఇద్దరు కలిసి టీడీపీని టీఆర్ఎస్ లో విలీనం చేస్తు ఈమధ్యనే స్పీకర్ కు లేఖ అందించారు. దాంతో అధికారికంగా టీఆర్ఎస్ లో  టీడీఎల్పీ విలీనమైపోయింది.




టీడీఎల్పీని అధికారపార్టీలో విలీనం చేయటంలో కీలకపాత్ర పోషించినందుకు సండ్రను మంత్రివర్గంలోకి తీసుకోవాలని కేసీయార్ డిసైడ్ అయ్యారట. విలీనం నేపధ్యంలో  అసలు సండ్రకు కేసీయార్ ఇచ్చిన ఆఫరేనట అది. దాంతో తన మంత్రివర్గంలో కేసీయార్ మార్పులు, చేర్పులు చేయబోతున్నారని టాక్ పెరిగిపోతోంది. కొత్తగా ఏర్పడబోయే మంత్రివర్గంలో సండ్రకు చోటు ఖాయమంటున్నారు. ఇఫ్పటికే నాలుగుసార్లు ఎంఎల్ఏగా గెలిచిన సండ్రకు నియోజకవర్గంలో మంచి పట్టేఉంది. పాలేరులో ఒకసారి గెలవగా సత్తుపల్లిలో మూడుసార్లుగా గెలుస్తున్నారు. మొత్తానికి టీడీఎల్పీ విలీనంలో కీలకపాత్ర పోషించినందుకు సండ్రకు మంచి బహుమతే దక్కేట్లుంది. చూద్దాం చివరకు ఏమి జరుగుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: