ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబునాయుడు వైఖరి చాలా విచిత్రంగా ఉంటుంది. తాజాగా వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామకృష్ణంరాజు అరెస్టుకు వ్యతిరేకంగా ప్రభుత్వంపై చంద్రబాబు రెచ్చిపోవటం చూస్తుంటే చాలా ఆశ్చర్యమేస్తోంది. చంద్రబాబు రెచ్చిపోవటం చూస్తుంటే అసలింతకీ కృష్ణంరాజు ఏ పార్టీ ఎంపి అని జనాలకు డౌటొచ్చేస్తోంది. టీడీపీ ఎంపిలు లేదా ఎంఎల్ఏలు లేదా మాజీలు అరెస్టయినపుడు వాళ్ళకు మద్దతుగా చంద్రబాబు రియాక్టవ్వటంలో అర్ధముంది. సొంతపార్టీ నేతలను రక్షించుకునేందుకు చంద్రబాబు బాగా ప్రయత్నిస్తున్నారని జనాలు కూడా సరిపెట్టుకుంటారు. కానీ ఇపుడు కృష్ణంరాజు అరెస్టుకు వ్యతిరేకంగా ప్రభుత్వంపై చంద్రబాబు ఎందుకింతగా రెచ్చిపోతున్నారో జనాలకు అర్ధం కావటంలేదు.
కృష్ణంరాజు అరెస్టుపై ఇంత రాద్దాంతం చేస్తున్న చంద్రబాబు గతంలో పార్టీ నేతలు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, దూళిపాళనరేంద్ర అరెస్టయినపుడు కూడా ఇంతగా స్పందించలేదు. అప్పట్లో ఒకటిరెండు సార్లు మీడియాలో తన నిరసన తెలిపి ఊరుకున్నారు. కానీ ఇపుడు అలా కాకుండా వరుసగా నేతలతో సమావేశాలు పెడుతున్నారు. మీడియాలో, ట్విట్టర్లో ఒకటే గోలచేస్తున్నారు. చివరకు రాష్ట్రపతి, గవర్నర్ కు కూడా లేఖలు రాసేశారు. చంద్రబాబు రియాక్షన్ చూస్తున్న చాలామంది నేతలే అసలు విషయం అర్ధంకాక బుర్రలు గోక్కుంటున్నారు. టీడీపీలో ఉండి క్షత్రియ సామాజికవర్గం నేతలే కృష్ణంరాజు అరెస్టుపై ఇప్పటివరకు నోరిప్పలేదు.
పార్టీలోను బయట జరుగుతున్నది చూసిన తర్వాత అందరు ఓ విషయంలో చంద్రబాబును అనుమానిస్తున్నారు. అదేమిటంటే ఇన్నిరోజులుగా తిరుగుబాటు ఎంపి రెచ్చిపోవటం వెనుక చంద్రబాబు ఉన్నారని వైసీపీ ఎంపిలు ఆరోపిస్తున్నారు. కృష్ణంరాజు మొబైల్ ఫోన్ ను సీఐడీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారని తెలిసిన దగ్గర నుండి చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోతోందని ప్రచారం జరుగుతోంది. కృష్ణంరాజు మొబైల్ లో కొంతమందితో జరిపిన వాట్సప్ చాటింగ్ , వాట్సప్ కాల్ హిస్టరీ, ఎస్ఎంఎస్ లు అన్నింటినీ సీఐడీ పోలీసులు రికార్డులు చేసి పెట్టుకున్నారనే ప్రచారం పెరిగిపోతోంది. ఇటువంటి అనేక కారణాల వల్లే చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోతోందట. మరి కృష్ణంరాజు మొబైల్ ఫోన్లు ఏమేమి రహస్యాలు ఉన్నాయో ఎప్పుడు బయటపడతాయో చూడాల్సిందే.