హేమిటో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబునాయుడుకు పిచ్చి పీక్స్ కు చేరుకున్నట్లుంది. జగన్మోహన్ రెడ్డి వైఖరికి నిరసనగా అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తున్నామని ప్రకటించారు. ఇంతవరకు బాగానే ఉంది ఎందుకంటే వాళ్ళపార్టీ వాళ్ళిష్టం. మరి మళ్ళీ మాక్ అసెంబ్లీ ఏమిటి మధ్యలో ? మాక్ అసెంబ్లీ అంటే ఏమిటసలు ? అసెంబ్లీలో స్పీకర్, సీఎం, మంత్రులు, ఎంఎల్ఏల హోదాలను పోలినట్లుండే డూప్లికేట్ హోదాలతో అసెంబ్లీ సమావేశాలు నడిపినట్లు నటిస్తారన్నమాట. ఎలాగూ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే మాక్ అసెంబ్లీ అన్నారు కాబట్టి స్పీకర్, సీఎం, మంత్రులు,  అధికారపార్టీ ఎంఎల్ఏలకు వ్యతిరేకంగా డూప్లికేట్ పాత్రలతో సరదాగా చేసే కార్యక్రమమే ఈ మాక్ అసెంబ్లీ. ఇలాంటి వాటివల్ల ఎవరికి ఉపయోగం ? అంటే ఎవరికీ లేదనే చెప్పాలి.





తాను చెప్పిందంతా ఎదురుప్రశ్న వేయకుండా పైగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబునాయుడుకు మరికొన్ని పాయింట్లు అందించే మీడియా ఎలాగూ ఉంది. కాబట్టి చెప్పింది చెప్పినట్లుగా రాసుకుని యథాతథంగ అచ్చేసే మీడియా ఉన్నపుడు మళ్ళీ మాక్ అసెంబ్లీ అనే ప్రహసనం నడిపించటం చంద్రబాబుకు అవసరమా ? పైగా మాక్ అసెంబ్లీ అనే ప్రహసనం కూడా ఏ రోడ్డు మీదో లేకపోతే అమరావతి అసెంబ్లీ దగ్గరే జరపలేదు. జరిగిందంతా జూమ్ యాప్ లోనే. మాక్ అసెంబ్లీని జూమ్ యాప్ లో జరిపితే ఎవరు చూస్తారు ? ఎంతమంది చూస్తారు ? చంద్రబాబు+ఎంఎల్ఏలు తప్ప చూసేందుకు ఎవరులేరు. ఇంతోటిదానికి పెద్దగా మాక్ అసెంబ్లీ అని ప్రకటించి మరీ జగన్మోహన్ రెడ్డిని నోటొకిచ్చినట్లు తిట్టడానికి తప్ప మాక్ అసెంబ్లీ ఇంకెందుకు పనికిరాదు. జగన్ ప్రభుత్వంపై ఆరోపణలుచేయటం, విమర్శించటం, బురదచల్లేయటం ఎలాగూ రోజు జరుగుతున్నదే కదా.





ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే క్షేత్రస్ధాయిలో జనాలు పార్టీని పట్టించుకోవటం మానేశారు. వరుసఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి పార్టీ కుదేలైపోయింది. ఏదో ఎల్లోమీడియా పుణ్యమాని జనాల్లోకి చంద్రబాబు+పార్టీ నేతల వాయిస్ ఎంతోకొంత వెళుతోంది. 24 గంటలూ, 365 రోజులు జగన్ పై బురదచల్లటమే టార్గెట్ గా పెట్టుకునే బదులు ఆ సమయాన్ని పార్టీ బలోపేతానికి ఉపయోగిస్తే బాగుండేది. పార్టీలోనే బొచ్చెడు సమస్యలున్నాయి. ముందు వాటిని సర్దుబాటు చేసుకుని, పార్టీకి యువరక్తాన్ని ఎక్కించి బలోపేతం చేసే ప్రయత్నాలు చేస్తే పార్టీఅన్నా బాగుపడుతుంది. మీడియా దన్నుతో పిచ్చి భ్రమల్లో నుండి బయటకు రాకుండా మరింత కూరుకుపోయి మాక్ అసెంబ్లీ లాంటి పిచ్చి చేష్టలు చేస్తే ఉపయోగం ఉండదు. ఎందుకంటే సచివాలయంలో చేయాల్సిన పరిపాలనను కూడా చంద్రబాబు 2024 తర్వాత జూమ్ యాప్ లోనే చేసుకోవాల్సొస్తుందేమో ?

మరింత సమాచారం తెలుసుకోండి: