ఆ మధ్య లోకేశ్ ఏమన్నాడు.. టీఎస్‌పీఎస్సీ కాస్తా వైసీపీ పీఎస్సీ అయిపోయిందని అన్నాడా లేదా.. ఏపీపీఎఎస్సీలో అన్నీ అక్రమాలే జరుగుతున్నాయాని గోలెట్టాడా లేదా.. అక్కడితో ఆగాడా.. ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ ఉద్యోగాలు రాసిన కుర్రాళ్లతో జూమ్ మీటింగ్ ఎట్టాడా లేదా.. గ్రూప్ వన్ పేపర్లు ప్రైవేటు కంపెనీతో ఎట్టా దిద్దిత్తారని నిలదీశాడా లేదా.. అదుగో అలా నిలదీసిన ఫలితం ఇప్పుడు కనిపిస్తోంది.
ఇదే అంశంపై ఇప్పుడు ఏపీ హైకోర్టు జగన్ సర్కారుకు మొట్టికాయలు వేసింది. అదేందయ్యా.. ప్రైవేటు సంస్థతో గ్రూప్ వన్ పేపర్లు ఎట్టా దిద్దిత్తారు అని ప్రశ్నించిన హైకోర్టు.. ఈ యవ్వారం తేలేదాకా ఇంటర్వూలు పెట్టబాకండి అంటూ స్టే ఇచ్చేసింది. అసలు లెక్క ప్రకారం అయితే రేపటి నుంచే ఈ గ్రూప్ వన్ ఉద్యోగాలకు ఇంటర్వూలు పెట్టాల. కానీ.. కోర్టు ఇలా చెప్పేసింది కదా. దీంతో ఏపీపీఎస్సీ కూడా ఇంటర్వ్యూలను వాయిదా వేసేసింది.
అంతే కాదు. లోకేశ్ పదో తరగతి పరీక్షల మీద కూడా చాలా రోజులుగా పోరాటం చేస్తున్నాడు. అయితే అందుకనో ఏమో.. లోకేశ్ చెబితే మేం వినేదేంటి అనుకున్నారో ఏమో కానీ.. మొత్తానికి పదో తరగతి పరీక్షలపై మాత్రం జగన్ సర్కారు పట్టు వీడటం లేదు. పరీక్షలు రద్దు చేసేసి పాస్ చేసేస్తే ఆ క్రెడిట్ లోకేశ్ ఖాతాలోకి వెళ్లిపోతుందనే జగన్ మొండి పట్టు పడుతున్నారని కూడా లోకేశ్ బ్యాచ్ ఆరోపిస్తోంది. ఏదేమైనా లోకేశ్ జగన్‌కు ఇలా జల్ల కొట్టాడన్నమాట.