
అయితే ఇప్పుడు ప్రభుత్వాలు ఉద్యోగాలు త్వరగా నింపట్లేదు. అనుమతి ఉన్న ఉద్యోగాలనే ఖాళీగా పెడుతున్నారు తప్ప త్వరగా నోటిఫికేషన్లు వేయడం లేదు. తాజాగా తేలిందేమిటంటే.. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని మొత్తం 8.72 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయట. వివిధ శాఖల్లో ఈ ఖాళీలు ఉన్నాయట. ఈ విషయాన్ని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయమంత్రి జితేందర్ సింగ్ స్వయంగా చెప్పారు. ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆయన రాజ్యసభలో సమాధానం చెప్పారు.
2020 మార్చి ఒకటో తేదీ నాటికి కేంద్రంలో మొత్తం 40 లక్షల 4 వేల 9వందల 41 పోస్టులు మంజూరు అయ్యాయట. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో 31 లక్షల 32వేల 6వందల 98 మంది పనిచేస్తున్నారట. అంటే.. గతేడాది మార్చి ఒకటో తేదీ నాటికి 8లక్షల 72వేల 2వందల 43 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నమాట. 2016-17 నుంచి 2020-21 వరకు ఐదేళ్లలో యూపీఎస్సీ ద్వారా 25వేల 267 ఉద్యోగాలు నియమించారట. అలాగే.. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ద్వారా 2లక్షల 14వేల 601 ఉద్యోగాలు భర్తీ చేశారట.
ఇక రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 2లక్షల 4వేల 245 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ రాజ్యసభకు వెల్లడించారు.. ఈ విషయంలో రాష్ట్రాలు కూడా ఏమీ తక్కువ తినలేదు. కేసీఆర్ సర్కారు దాదాపు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంచిందని ఇటీవల ఓ కమిటీ నివేదికలో తేలింది. ఈ ఉద్యోగాలు నింపితే.. లక్షల మంది యువతకు ఉపాధి దొరుకుతుంది. ప్రభుత్వ పనులూ సాఫీగా సాగుతాయి.