
హెల్మెట్ పెట్టుకోండి
వాహనం నడపండి
రహదారి నియమాలు పాటించండి
మీరు జాగ్రత్త
మీతో పాటూ
మీ తోటి ప్రయాణికులూ జాగ్రత్త
అతివేగం ప్రమాదకరం
రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత
ఎన్ని విన్నాను సర్ ఇలాంటివి.ఎన్ని చదివేను సర్ ఇలాంటివి.అబ్బా!హైద్రాబాద్లో ప్రతిచోటా ఇవే!చదివి,చదివి విసిగిపోయానండి!అంతెం దుకు! మా..శ్రీకాకుళంలోనూ! ఇవే బోర్డులు..నోరు తెరిచి అరిచిన విధంగా ఉంటాయండి ..కానీ వాటికి తెలియవు అండి..మీరు కానీ మే ము కానీ ఎప్పుడూ రూల్స్ చెప్తామే కానీ పాటించం అని! ఏం ఫీల్ కాకండి ఇవన్నీ మామూలే..మీరు ఎన్నికల ప్రచా రంలో ఉన్నారు క నుక ఇవన్నీ ఎక్కడండీ గుర్తుంటాయి. కార్యకర్తలనే పిలుస్తారా..మైక్ సెట్లనే కడతారా..ఆఫీసు బోయ్ కే జీతాలు ఇస్తారా..ఎన్ని పనులు సర్.. ప్రజలు అప్పగించిన పనులు..కార్యకర్తల పనులు..పార్టీ పనులు..పార్టీకి అనుబంధం ఉండే సంఘాల పనులు..ఇన్ని పనులలో మీ రే కాదు పాపం మీ ఫాలోవర్సూ మరిచితిరి హెల్మెట్టు పెట్టుట..అదే జరిగింది నిన్న హుజూరాబాద్లో..
జమ్మికుంట పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ గారికి మద్దతుగా రోడ్ షో చేశారని విన్నాను. చూశాను కూడా! బాగుంది ఆ రోడ్ షో..మీరూ..మీ ఫ్యాన్స్ ఎంత మంది అండి అస్సలు కరోనా నిబంధనలే పాటింపు లేవు. కానివ్వండి పోనీ హెల్మెట్ పెట్టుకున్నారా అంటే అదీలేదు.అదేంటి అన్నయ్యా! నేను హెల్మెట్ పెట్టుకోకపోతే ఫైన్ వేశారు మరి!ఆయనకెందుకు వేయరు అని అమాయకంగా.. అ యోమయంగా..అదోరకంగా..అడిగిండు నా తమ్ముడు..నవ్వి ఊరుకున్నాను సర్.!మాదే తప్పు సర్! మీరు బండి ఆపించి ఫైన్ రాయిం చిన ప్రతిసారీ ఇప్పటి ఫొటో ఒకటి రేపటి నుంచి చూపించకుండా,మళ్లీ యథాలాపంగా మేం ఫైన్ కడతాం చూడండి అది మా తప్పు..ఏం కాద్సార్ ! మీరు మీ పనిలో మీ సేవా కార్యక్రమాల్లో ఉండండి..నేను మాత్రం ఠాణాకు పోయి చలానా ఎంతన్నది తెల్సుకుని మరీ! వచ్చెద ను. సర్..ఇలా రాసినందుకు కోపం కావొద్దు ప్లీజ్ .. ఏదో అమాయక ప్రాణులం మన్నించండి..సర్! ఇప్పటికైనా మీరు హెల్మెట్ పెట్టుకుని బండి డ్రైవ్ చేయండి..అలానే మీలానే ఇంకొందరు కూడా ఈ పని చేస్తే బెటర్ సర్..!
- ఇట్లు మీ శ్రేయోభిలాషి