అబ్బే.. ఆంధ్రప్రదేశ్ అప్పులపాలైపోయింది.. ఏపీలో జీతాలు కూడా సరిగ్గా రావడం లేదు.. జగన్ ప్రభుత్వ ఆస్తులు మొత్తం తనఖా పెట్టేస్తున్నాడు. చివరకు మద్యం షాపులపై ఆదాయం కూడా చూపించి అప్పుడు తెచ్చుకుంటున్నారు.. అటు కేంద్రం కూడా జగన్ సర్కారు అప్పులపై మండిపడుతోంది. ఓయ్.. జగన్ ఇలాగైతే కష్టం అంటూ వార్నింగులు కూడా ఇచ్చేసింది.. ఇదీ ఇలా సాగుతాయి.. చంద్రబాబు అనుకూల మీడియాలో జగన్ సర్కారుపై కథనాలు..


అయితే.. ఆ మీడియా కథనాల సంగతి ఏమో కానీ.. ఏపీ సీఎం జగన్ మాత్రం నగదు పంపిణీ విషయంలో మాత్రం లెక్క తప్పకుండా పంచుతున్నాడు. ఎలాంటి సమస్యలు అయినా ఉండనీ.. చెప్పిన సమయానికి చెప్పిన వర్గాలకు నగదు బదిలీ జరగాల్సిందే.. ఇదీ జగన్ తీరు.. అందుకు తాజా ఉదాహరణ ఇప్పుడు విడుదల చేస్తున్న వైఎస్ఆర్ ఆసరా రెండో విడత డబ్బుల పంపిణీ. ఏపీ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 18 తేదీన  ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుంది.


ఏపీ రాష్ట్రంలో 7.97 లక్షల మంది పొదుపు సంఘాల్లో ఉన్న 78.76 లక్షల మంది మహిళలకు 2019 ఏప్రిల్‌ వరకు వారు బాకీపడిన మొత్తం రూ.25,512 కోట్లు నాలుగు విడతల్లో వారి చేతికే అందిస్తామని గతంలో జగన్ హామీ ఇచ్చారు. ఆ మాటకు కట్టుబడి వరుసగా రెండో సంవత్సరం రూ.6,440 కోట్లు ఈనెల 18వ తేదీ వరకు పొదుపు సంఘాలకు జమ చేయబోతున్నారు. ఇదొక్కటే కాదు.. గతంలోనూ ఇలాంటి నగదు పంపిణీ స్కీముల విషయంలో జగన్ మాటంటే మాటే అన్నట్టుగా ముందుకు సాగుతున్నారు.


అంతకు ముందే.. జగనన్న అమ్మ ఒడి ద్వారా 44.50 లక్షల మంది తల్లులకు 85 లక్షల మంది పిల్లలకు మంచి జరిగేలా ప్రతి ఏటా రూ.6500 కోట్ల చొప్పున ఇప్పటికే రూ.13023 కోట్లు నేరుగా అందించేశాడు జగన్. వైయస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక ద్వారా ఇప్పటి వరకు రాష్ట్రంలో 61 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. 61 లక్షల మందికి రూ.2250 ఇస్తున్నామని చెబుతోంది. 61 లక్షల్లో అక్షరాల 36.70 లక్షల మంది అవ్వలు, మహిళా వికలాంగులు, వితంతువులకు ఇచ్చిన మొత్తం రూ.20,894 కోట్లుగా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: