స్వపక్షంలో విపక్షంగా తయారైన వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై అనర్హత వేటుకు రంగం సిద్ధమైనట్టు కనిపిస్తోంది. నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని వైసీపీ దాఖలు చేసిన పిటిషన్‌ను లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ప్రివిలేజ్‌ కమిటీకి పంపినట్టు తెలుస్తోంది. వైసీపీ చీఫ్‌ విప్‌ మార్గాని భరత్‌ గతంలో దాఖలు చేసిన పిటిషన్‌ను ఈనెల 27న స్పీకర్ ప్రివిలేజ్‌ కమిటీకి పంపారు. ఈ మేరకు లోక్‌సభ సచివాలయం బులిటిన్‌ను విడుల చేసింది.


ఈ పరిణామాలు చూస్తుంటే.. ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై వేటుకు రంగం సిద్దమైనట్టు కనిపిస్తోంది. అయితే.. నాపై అనర్హత వేటు వేయించండ్రా బాబో అని ఎంపీ రఘురామ కృష్ణంరాజు కొంతకాలంగా మొత్తకుంటూనే ఉన్నారు.. మొన్నటికి మొన్న.. మీ వల్ల అవుతుందా.. కాదా.. తేల్చి చెప్పండి.. మీ వల్ల కాదంటే చెప్పండి.. అప్పుడు నేనే రాజీనామా చేస్తా అంటూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు రంకెలు వేసిన సంగతి తెలిసిందే.. తనపై అనర్హత వేయి వేయించేందుకు ఫిబ్రవరి మొదటి వారం వరకూ రఘురామ కృష్ణంరాజు గడువు ఇచ్చారు.


అంతే కాదు.. తనపై వేటు వేయించలేకపోతే.. ఆ విషయం ఒప్పుకోండి.. అంటూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వెటకారం ఆడారు కూడా.. ఇప్పుడు ఆ గడువు సమీపిస్తున్న సమయంలో లోక్‌సభ స్పీకర్ స్పందించడం చూస్తుంటే.. వైసీపీ పావులు కదిపినట్టే కనిపిస్తోంది. ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఇచ్చిన గడువులోపల ఆయనపై అనర్హత వేటు వేయించి పరువు దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నట్టే కనిపిస్తోంది.


మరి స్పీకర్ ఇచ్చిన పిటీషన్‌ను ప్రివిలేజ్‌ కమిటీ పరిశీలించాల్సి ఉంటుంది. ఆ తర్వాత తన నిర్ణయం ప్రకటిస్తుంది.. దాన్ని స్పీకర్ ప్రకటించాల్సిఉంటుంది. మరి ఇదంతా ఈ రోజుల వ్యవధిలోనే జరిగిపోతుందా.. లేదంటే.. మీ వల్ల కావడం లేదు కనుక నేనే రాజీనామా చేసేస్తున్నా అని ఎంపీ రఘురామ కృష్ణంరాజే స్వయంగా రాజీనామా చేసేస్తారా.. అన్నది మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

RRR