ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందన్నమాట వాస్తవమే. అయితే కరోనా కారణంగా ప్రభుత్వాల ఆదాయాలు పడిపోయాయి. అదే సమయంలో కరోనా కోసం ప్రభుత్వం చేయాల్సిన ఖర్చులు పెరిగిపోయాయి. అసలే సంక్షేమ రాజ్యం.. పథకాల కోసం భారీగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఏపీ సర్కారు అప్పుల కోసం తెగ ప్రయత్నిస్తోంది. అయితే.. అప్పులు లేకుండా ఏపీ సర్కారుకు బ్రహ్మాండంగా ఆదాయం వచ్చే ఐడియా ఒకటి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చెబుతున్నారు.


నిన్న మొన్నటి వరకూ ఏపీలో టీడీపీ గుడివాడ క్యాసినో ఘటనపై నానా యాగీ చేసింది. ఈ కేసినో ద్వారా రూ. 350 కోట్ల వరకూ చేతులు మారాయని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అంచనా వేశారు. ఏపీలో ప్రభుత్వం వద్ద డబ్బు లేకపోయినా జనం దగ్గర మాత్రం డబ్బు బాగానే ఉందని  ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అంటున్నారు. అందుకే... ఏపీ సర్కారు ప్రతి నియోజక వర్గంలోనూ అధికారికంగా క్యాసినో నడుపుకునే వెసులుబాటు కల్పిస్తే రాష్ట్రానికి భారీగా ఆదాయం వస్తుందని తన కొత్త పలుకు ఎడిటోరియల్‌లో  ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసుకొచ్చారు.


క్యాసినోల ద్వారా ఆదాయం తెచ్చుకోమని జగన్‌కు  ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ సలహా ఇవ్వడం అంటే... అది వెటకారంగానే సుమా..  ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇలా రాయడం వెనుక మరో కడుపుమంట కూడా ఉందనుకోవచ్చు.. ఎన్ని ఇష్యూలు వచ్చినా ఏపీలో జనం పెద్దగా పట్టించుకోవడం లేదని..  ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తెగ బాధపడిపోతున్నారు. అంతే కాదు.. జగన్‌ ఓ ఇష్యూ నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కొత్త సమస్యలు సృష్టిస్తుంటారని చెప్పుకొచ్చారు.


కొత్త జిల్లాల ఏర్పాటు వ్యవహారాన్ని తెరపైకి తెచ్చి జగన్.. ఈ  కేసినో వ్యవహారం నుంచి మంత్రి కొడాలి నానిని కాపాడడారని  ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చెబుతున్నారు. అంతే కాదు.. సమస్య ఎంత తీవ్రమైనది అయినా పెద్దగా పట్టించుకోని సమాజం అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకూ చురకలు వేశారు. అందుకే కేసినో వ్యవహారం చప్పున చల్లారిపోయిందని బాధపడిపోతున్నారు. జగన్ తీరుతో విపక్షాలకు ఆయాసమే వస్తోంది తప్పు రాజకీయ ప్రయోజనం కలగడం లేదని బాధపడిపోతున్నారు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ.

మరింత సమాచారం తెలుసుకోండి: