ఇదేదో స్కూల్ డుమ్మా కొట్టేందుకు చిన్న పిల్లాడి ఆటలో ఉంది. టీచర్ నేను బడికి రాలేను ఇవాళ నాకు జ్వరం అని దొంగ జ్వరం తెచ్చుకున్న పిల్లాడిలా ఉంది. అయినా పెద్దాడయిన కేసీఆర్ ఇంకా పిల్లాడిలా జ్వరం పేరిట సెలువులు,సాకులు చూపడం ఏంటి?
కానీ రాజకీయం అన్నాక ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి కనుక కేసీఆర్ ఆ విధంగా చేస్తున్నారేమో!
ఉన్నట్టుండి కేసీఆర్ కు జ్వరం వచ్చేసింది.దీంతో ఆయన ప్రధానిని స్వాగతించేందుకు శంషాబాద్ కు పోలేదు. సాయంత్రానికి జ్వరం తగ్గిపోతుంది.కనుక అప్పుడు మాత్రం ఆయన ముచ్చింతల్ స్వామి ఆశ్రమానికి పోయి, జియరు స్వామి ఆశీస్సులు అందుకుంటారు.. అని తెలుస్తోంది. అంటే జ్వరానికి ఎలా ఇన్ని టైమింగ్స్ తెలుస్తున్నాయని? సమయానికి జ్వరం రావడం సమయానికి జ్వరం తగ్గడం ఇవన్నీ చూస్తుంటే కాస్త సందేహం కూడా రావడం లేదు కదూ! అవును! కేసీఆర్ సర్ ఎలా చెబితే అలా జ్వరం నడుచుకుంటుంది. ప్రభుత్వం నడుచుకుంటుంది. యంత్రాంగం కూడా నడుచుకుని తీరడం ఖాయం.
ఇక కేసీఆర్ రాజకీయంలో భాగంగా బీజేపీతో దూరం పైకి కనిపించినంత సులువేం కాదు.ఢిల్లీలో వసంత విహార్ లో ఖరీదయిన స్థలం తెలంగాణ భవన్ కు కేటాయించింది బీజేపీ.దేశ రాజకీయాలను శాసించే శక్తి తనకు ఉందని ఈ నిర్మాణం ద్వారా చెప్పాలనుకుంటున్నారు.అందుకే ప్రాంతీయ పార్టీలకు లేని విధంగా పార్టీ కార్యాలయ నిర్మాణం సాగిస్తున్నారు కేసీఆర్. ఇది కాకుండా బీజేపీతో ఉన్న బంధం కారణంగా ఆయన వచ్చేసారి క్యాబినెట్లో అడుగు పెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇప్పుడంటే విమర్శలు చేశారు కనుక దూరంగా ఉన్నారు. కానీ కేసీఆర్ రాజకీయం ఎప్పుడు ఎలా ఎటు మారిపోతుందో ఎవ్వరూ చెప్పలేరు. చెప్పేందుకు సాహసం కూడా చేయలేరు. కనుక ఇప్పటికిప్పుడు కేసీఆర్ జ్వరం తగ్గినా ఆయన స్వరంలో మార్పు మాత్రం రేపటి వేళ ఖచ్చితంగా ఉంటుంది.