ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కావాలని టీడీపీ బీజేపీతో విభేదించి గత ఎన్నికల సమయంలో పోరాటం చేసింది. పొత్తులో భాగంగా రాష్ట్రంలో ఉన్న స్నేహ బంధాన్ని తెంచుకుని ఎన్నికల వేళ కాంగ్రెస్ తో జత కట్టింది. మరి అదే కాంగ్రెస్ గెలిస్తే ప్రత్యేక హోదా ఇస్తుందని నమ్మకంతో చేరింది. కానీ అనుకున్నవి అన్ని జరిగితే రాజకీయాలు ఎలా అవుతాయి. ప్రజలు రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ తో టీడీపీ కలయికను అస్సలు జీర్ణించుకోలేదు.


దీంతో జగన్ కు పూర్తి స్థాయి మెజార్టీ ఇచ్చారు. టీడీపీని చిత్తు చిత్తుగా ఓడించారు. ప్రత్యేక హోదా కావాలంటే కేంద్రంలో కాంగ్రెస్, లేదా బీజేపీ పార్టీల మద్దతు కచ్చితంగా అవసరం. లేకపోతే ఏమీ చేయలేరు. కాబట్టి బీజేపీ ఇవ్వలేదు. కాంగ్రెస్ ఇస్తుందనే నమ్మకంతోనే పొత్తుకు వెళ్లినా అది కూడా నాలుగేళ్లుగా బీజేపీతో పొత్తులో ఉండి సడెన్ గా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది.


ఇప్పుడు మళ్లీ బీజేపీతో పొత్తుకు టీడీపీ తెగ ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. బీజేపీ ప్రత్యేక హోదా ఇస్తామని మాత్రం ఎక్కడా చెప్పడం లేదు. అయినా టీడీపీ బీజేపీతో పొత్తుకు ప్రయత్నం చేస్తూనే ఉంది. దీని వెనక ఉన్న కారణాలు మాత్రం టీడీపీ బహిర్గతం చేయడం లేదు. కానీ ఎన్నికల తర్వాత జగన్ ఒక స్పష్టమైన మాట చెప్పారు.


కేంద్రంలో బీజేపీ గానీ కాంగ్రెస్ గానీ ఎవరికైనా స్పష్టమైన మెజార్టీ రాకుండా 20 నుంచి 25 సీట్లు తక్కువ వచ్చి అప్పుడు మనకు దాదాపు 20 ఎంపీ స్థానాలు ఉంటే మన రాష్ట్రానిని ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఎవరూ ఆపలేరు. ముందు ప్రత్యేక హోదాపై సంతకం పెట్టిన తర్వాతే కేంద్రంలోని ఆయా పార్టీలకు మద్దతు ఇస్తామని ప్రకటించారు. అలా ఏమైనా బీజేపీతో ఒప్పందం చేసుకున్నారా అని ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: