సీపీఐ పార్టీని టీడీపీలో విలీనం చేస్తే అయిపోతుంది కదా అని చాలా మంది అనుకుంటున్నారు. సీపీఐ నేత రామకృష్ణ ఆంధ్రలో బస్సు యాత్ర చేస్తున్నారు. అయితే తన పార్టీని బాగు చేసుకోవడానికి చేస్తున్నాడా లేక టీడీపీకి సలహాలు ఇవ్వడానికి చేస్తున్నారా అనేది అర్థం కాకుండా తయారైంది. తాజాగా తెలంగాణ లో టీడీపీ ఒంటరి పోరాటంపై అభినందిస్తున్నామని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. తెలంగాణలో సీపీఐ పార్టీ ఉంది అక్కడ ఒక కార్యవర్గం ఉంటుంది వారు దీని గురించి మాట్లాడతారు.


ఇక్కడ ఉన్న రామకృష్ణ తెలంగాణలో టీడీపీ ఒంటరి పోరాటం చేస్తే మెచ్చుకోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ వెనకాల పడిన కూడా కేసీఆర్ అస్సలు పట్టించుకోకుండా వెళ్లిపోమ్మని చెప్పాడు. అయినా చివరి వరకు బీఆర్ఎస్ ఏమైనా టికెట్లు ఇస్తుందా అని ఆశపడి పొత్తుకు చివరి వరకు ప్రయత్నించారు. కానీ కేసీఆర్ కొట్టిన దెబ్బకి దిమ్మతిరిగిపోయింది.


తెలుగుదేశం, సీపీఐ, సీపీఎం కలిసి తెలంగాణలో పోటీ చేయాలని రామకృష్ణ నేరుగా అడిగితే అయిపోతుంది. కానీ టీడీపీ తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తున్నాం అని డొంకతిరుగుడు మాటలు ఎందుకు మాట్లాడుతున్నారని అంటున్నారు. అయితే చంద్రబాబుకు మాత్రం బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని తహతహలాడుతున్నారు. కానీ రామకృష్ణ మాత్రం దానిపై మాట్లాడకుండా కేవలం  టీడీపీ తెలంగాణలో తీసుకున్న నిర్ణయం చాలా ఉన్నతమైందంటూ చెప్పడం హ్యాస్పాస్పదంగా అనిపిస్తుంది.


అసలు సీపీఐ, కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించి కేవలం 1 శాతం మాత్రమే ఓట్లు ఉన్నాయి. ఎలాంటి స్థాయి నుంచి ఎక్కడికి పడిపోయారు. దేశంలో ప్రధాన పార్టీలుగా ఉన్న సీపీఎం, సీపీఐ ఇలా దిగజారిపోయాయంటే ఎంతటి దారుణ పరిస్థితి తలెత్తిందో అర్థం చేసుకోవచ్చు. పార్టీని బాగు చేసుకుని క్షేత్ర స్థాయిలో మెరుగుపడాలి. యువతరానికి దగ్గర కావాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. కానీ వీటన్నింటినీ విడిచిపెట్టి టీడీపీ, బీఆర్ఎస్, జనసేన అంటూ తిరిగితే సీపీఐకి ఉన్న ఆ కాస్త ఓటింగ్ కూడా మాయం కావడానికి ఎన్ని రోజులో పట్టదు.

మరింత సమాచారం తెలుసుకోండి: