నిజాయతీపరుడైన ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ పై కక్ష సాధింపుతో తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపినట్లుగానే 45 ఏళ్ల పాటు నిస్వార్థంగా రాష్ట్రానికి సేవ చేసిన చంద్రబాబు పై తప్పుడు కేసులు పెట్టారని టీడీపీ అంటోంది. ఇటీవల లోక్ సభ పక్ష నేత రామ్మోహన్ నాయుడు చంద్రయాన్ విజయవంతంపై జరిగిన చర్చలో పార్లమెంట్ లో ఇలాగే మాట్లాడారు కూడా.


అయితే.. నంబీ నారాయణన్ కేసు గురించి సభ దృష్టికి తెస్తూ శాస్త్ర సాంకేతిక అభివృద్ధికి ఏళ్ల తరబడి చేసిన కష్టం.. సంకుచిత కక్ష సాధింపు చర్యతో వృథా అవుతోందని చెప్పడానికి ఆయన ఉదంతమే ఉదాహరణ అని పేర్కొన్నారు. నంబిని జైలుకు పంపిన తర్వాత దేశానికి సేవ చేయాలనుకునే శాస్త్రవేత్తల్లో  భయాందోళనలు రేకేత్తాయని.. అన్ని అభియోగాల నుంచి ఆయన బయటకు వచ్చినా ఆరోగ్యం, ప్రతిష్ఠ దెబ్బతిన్నాయి.


అలాగే మచ్చలేని తమ నేత చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారు. నిజాయతీని శిక్షించడం ద్వారా తన లాంటి యువ నాయకులకు ఎలాంటి సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. మరోవైపు సైకో ఫ్యాన్స్ చుట్టుముట్టిన నాయకుడు ఈ దేశానికి చెందిన రూ.43 వేల కోట్లు దోచుకొని ఈ నెల 23న పదో బెయిల్ వార్షికోత్సవం జరుపుకోబోతున్నారు. అందువల్ల ఈ వ్యవస్థను సరిదిద్దాలి.   చంద్రబాబు అరెస్టును ఈ సభలోని వారంతా ముక్తకంఠంతో నినదించాలని పిలుపునిస్తున్నా అని పార్లమెంట్ లో కీలక ప్రసంగం చేశారు.


నంబి నారాయణ్‌ను చైనా వాళ్లు కుట్ర పన్ని దేశ ద్రోహం కేసులో ఇరికించారు. చంద్రబాబు, నంబి లాంటి గొప్ప వ్యక్తి ఎలా అయ్యరని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. శాస్త్రవేత్తకు, రాజకీయ నాయకుడికి ఎలా ముడి పెడతారని వారు ప్రశ్నిస్తున్నారు. నంబి నారాయణన్ దేశం పట్ల ప్రేమతో ఉంటారు. చంద్రబాబుకి తమ పార్టీపై, లేదా రాష్ట్రంపై మాత్రమే ప్రేమ ఉంటుంది. ఈ పోలిక వల్ల టీడీపీ శ్రేణులు ఆనందంగా  ఉంటారు కానీ తటస్థులకు చిరాకు తెప్పిస్తుంది అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: