హైదరాబాద్ ను అభివృద్ధి నా హయాంలోనే జరిగింది. ఐటీ రావడానికి కారణం నేను అని చంద్రబాబు తరచూ చెప్పే మాట.  ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు పలు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. హైదరాబాద్ అనేది ఓ పెద్ద నగరం. వచ్చి కొన్ని రోజులు పరిపాలించి.. రెండు మూడు బిల్డింగులు కట్టి ఐటీ మొత్తాన్ని నేనే విస్తరించాను అని గొప్పలు చెప్పుకుంటారు అని అసెంబ్లీ సాక్షిగా వ్యాఖ్యానించారు.


హైదరాబాద్ కు నాలుగైదు వందల ఏళ్ల చరిత్ర ఉంది. కానీ అభివృద్ధి లో చంద్రబాబు పాత్ర లేదు  అంటే హాస్యాస్పదంగానే ఉంటుంది. అదే విషయానికొస్తే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించి మహిళా రిజర్వేషన్ల బిల్లును ఆమోదింపజేసింది.  ఇందులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ  కవిత పాత్ర ఉందని ఆ పార్టీ నేతలు విపరీతమైన ప్రచారం చేశారు.  
కేవలం దిల్లీలో ఒకరోజు కవిత దీక్ష చేస్తే దానికి భయపడి నరేంద్ర మోదీ భయపడిపోయి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించి ఈ బిల్లును ఆమోదింపజేశారా. ఈ బిల్లు ఘనత బీజేపీది.  ఈ ప్రచారం చూస్తుంటే రాజకీయ వర్గాల్లో మరో అనుమానం రేకెత్తుతోంది. అది ఏంటంటే బీఆర్ఎస్ కు బీజేపీకి రహస్య బంధం ఉంది. ఈ బిల్లు గురించి ముందే తెలిసి దిల్లీలో దీక్షలు డ్రామాలు జరిపారా అని రాజకీయ నేతలు ఆరోపిస్తున్నారు.


మద్యం కుంభకోణం విషయానికొస్తే అసలు కేసు మొత్తం కవిత చుట్టూనే తిరుగుతుంది. ఆ సందర్భంలో దీక్షలు చేయడం.. ఈడీ విచారణలో వాయిదాలు కోరడం.. అరెస్టు చేస్తారని పలు సార్లు ప్రచారం జరిగినా అవేమీ జరగలేదు. కేవలం రాజకీయంగా విమర్శించారు తప్ప ఆమెను ఇబ్బంది పెట్టలేదు. ఈ దీక్షలు తెర వెనుక బీజీపీ, బీఆర్ఎస్ మధ్య రహస్య బంధాన్ని బయటపెట్టింది అని పలు రాజకీయ పార్టీ నేతలు  విమర్శిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

KCR