
చాలా స్పష్టంగా చీఫ్ సెక్రటరీ జీవోలనే పేర్కొన్నారు. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గంటా శ్రీనివాస్ నా దగ్గరికి వచ్చిన సందర్భంలో సీఎస్ నాకు ఫోన్ చేసి సీఎం చెప్పారు మీరు డబ్బులు విడుదల చేయండి అని చెప్తేనే విడుదల చేశామని పేర్కొన్నారు. ఇక్కడ టీడీపీ నేతలు అవినీతి జరిగింది అని ఒప్పుకుంటున్నారా.. చంద్రబాబుతో కలిపి అధికారులను అరెస్టు చేయమని చెప్తున్నారా..? అన్న వాదన వస్తోంది.
గతంలో జగన్ కేసుల పుణ్యామా అని ఏ అధికారి తప్పును తన మీద వేసుకునేందుకు సిద్ధంగా లేరు. ఏదైనా ఫైల్ మీద వెంటనే రాసేస్తున్నారు. అదే ఇక్కడ జరిగింది. తప్పు చేయకపోతే చంద్రబాబుది తప్పులేదు…అధికారులది లేదు అని చెప్పాలి. కానీ ఇక్కడ అధికారులే తప్పు చేశారు అని టీటీపీ నేతలు వాదిస్తున్నారు.
అధికారులే తప్పు చేసుంటే విచారణ జరిపించి అరెస్టు చేయించాలి కదా ఇక్కడ అది జరగలేదు. అప్పుడు తెలియలేదు అని చెప్పడానికి కూడా వీలు లేదు. ఎందుకంటే ఆరోజు జీఎస్టీ పంపించిన తర్వాత అయినా చర్యలు తీసుకోవాలి. ఒకవేళ అప్పుడు తప్పును గుర్తించి విచారణకు ఆదేశిస్తే దానిని బయటకు తీస్తే అధికారులదే తప్పువుతుంది. చంద్రబాబు పాత్ర ఏమీ లేదని తేలిపోతుంది.