దీంతో కెనడా ప్రధాని భారత్ పై గుస్సా అయ్యాడు. నిజ్జర్ తర్వాత మరో తీవ్రవాది కూడా అక్కడ చనిపోవడం జరిగింది. ఇదిలా ఉంటే ఇప్పుడు కెనడాతో పాటుగా పాకిస్తాన్ కూడా భారత్ పైనే పడి ఏడుస్తుందని తెలుస్తుంది. భారత్ లో అనేక బాంబు దాడులకు కారణమైనటువంటి హఫీజ్ సయ్యద్ ఇప్పుడు పాకిస్తాన్ లో ఒక రాజకీయ నాయకుడు. అయితే అతని కొడుకు అయినటువంటి కమాలుద్దీన్ సయ్యద్ సడన్ గా మాయమైపోయాడట.
ఆయనని ఎవరో కిడ్నాప్ చేశారని తెలుస్తుంది. దాంతో హఫీజ్ సయ్యద్ ఇది భారత్ పనేనని అనుమానిస్తున్నాడట. అయితే ఇది పాకిస్తాన్ కావాలని ఆడుతున్న నాటకం అని కొంతమంది భారతీయులు అంటున్నారు. భారత్ భద్రతా దళాలు ప్రపంచమంతా విస్తరించి ఉన్నాయని చెప్పడం కోసం వాళ్లు ఇలా నాటకం ఆడుతున్నారని అంటున్నారు. అంతే కాకుండా భారతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ కూడా అక్కడే ఉండడంతో ఇది భారత్ పనే అని బలంగా సందేహిస్తున్నారు వాళ్ళు.
అంతే కాకుండా తాలిబన్ నుండి పాకిస్తాన్ కు వచ్చినటువంటి కరుడుగట్టిన తీవ్రవాదులకు సుఫారీ ఇచ్చి భారతే ఈ పని చేయించిందని మన వాళ్లు కూడా అనుమానిస్తున్నారు. భారత్ ఇప్పుడు రక్షణ విషయంలో మరింత కట్టుదిట్టంగా ప్రవర్తిస్తుంది. గతంలో తన మీదకు ఎవరైనా వచ్చి దాడి చేసిన తర్వాత అలర్ట్ అయ్యేది. కానీ ఇప్పుడు ఎవరైనా తనపై దాడి చేస్తున్నారు అని తెలిసిన వెంటనే, వారి కంటే ముందుగానే వారిపై దాడి చేస్తుంది.