
మంత్రి మల్లారెడ్డి అనగానే.. పాలమ్మినా.. పూలమ్మినా.. కష్టపడ్డా.. మంత్రైనా అని చెబుతుంటారు. ఓ సమావేశంలో తన ఆస్తుల వివరాలు మొత్తం బయట పెడతారు. ఎన్నికల అఫిడవిట్ కి వచ్చే సరికి తనకు రూ.95 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించగా చేతిలో ఒక్క రూపాయి నగదు లేదని.. కారు కూడా లేదని పేర్కొనడం ప్రతి ఒక్కరికి ఆశ్చర్యానికి గురి చేసేదే. అలాగే భట్టి విక్రమార్క తనకు అప్పులు ఏమీ లేవని పేర్కొన్నారు.
మరో వైపు సీఎం కేసీఆర్ అఫిడవిట్ తెలుసుకొని ప్రజలు షాక్ కి గురవుతున్నారు. అవునా.. ఇది ఎంత వరకు నిజమని చెవురు కొరుక్కొంటున్నారు. చిన్నపాటి లీడర్లే తమ పేరిట ఎలాంటి ఆస్తులు పెట్టుకోరు. అలాంటిది సీఎం, మంత్రులు, ప్రతిపక్ష నాయకులు తమ ఆస్తులు ఎందుకు చూపిస్తారంటూ అభిప్రాయ పడుతున్నారు. వ్యవసాయమే వృత్తిగా భావిస్తూ.. ఎక్కువ సమయం వ్యవసాయ క్షేత్రంలో గడిపే సీఎం కేసీఆర్ పేరు మీద ఎలాంటి భూమి.. గుంట లేదని తన అఫడవిట్ లో ప్రకటించడం అందరినీ విస్మయానికి గురి చేసింది.
తన పేరు మీద లేదు కానీ.. ఉన్న స్థలాలన్నీ కుటుంబ ఉమ్మడి స్థలాలుగా రాసుకొచ్చారు. అయితే సర్పంచులు, మండల నాయకులకే రూ.కోట్ల ఆస్తులు ఉంటున్న ఈ రోజుల్లో మన రాజకీయ నాయకులు చూపించే ఆస్తులను చూస్తే నవ్వొస్తుంది. వీటిని ప్రజలు గతంలో నమ్మేవారేమో కానీ ప్రస్తుతం అంత సులభంగా నమ్మడం లేదు.