తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ అభ్యర్థే  సీఎం అవుతారని ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా లు ప్రకటించారు. ఇది తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దాదాపు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 50శాతానికి పైగా ఉన్న బీసీలకు రాజ్యాధికారం రావాలని చాలామంది కోరుకుంటున్నారు. తాజాగా తెలంగాణలో బీసీ సీఎం అభ్యర్థి నిర్ణయాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సీఎం స్వాగతించారు.


అయితే అదే స్ఫూర్తితో ఏపీలో కూడా డిమాండ్ చేయగలరా అంటే సందేహమే. ఎందుకంటే పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఆంధ్రప్రదేశ్ లో ఉంది. తెలంగాణాలో చాలా తక్కువ. కాబట్టి ఏపీలో కూడా బీసీనే సీఎం అని ప్రకటిస్తే ప్రయోజనం ఉంటుంది. అయితే ఆ నిర్ణయాన్ని ప్రకటిస్తే అటు చంద్రబాబు నాయుడు, ఇటు పవన్ కల్యాణ్ ఇద్దరూ సీఎం పదవి చేపట్టడానికి అనర్హులవుతారు. ఎందుకంటే కాపులను ఇంకా బీసీల్లోకి చేర్చలేదు కాబట్టి.


రాజకీయంగా ప్రాధాన్యం లేని చోట హామీలు ఇవ్వడం వల్ల ఉపయోగం లేదు. ఉదాహరణకు మహారాష్ట్రలో అధికారంలోకి వస్తే మరాఠీలకు రిజర్వేషన్లు కల్పిస్తాం అని కేసీఆర్ చెబితే అక్కడి ప్రజలు గెలిపిస్తారా.. అందుకే మనం ఇచ్చే హామీలు కొంత నమ్మశక్యంగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు కమ్మ, రెడ్డి సామాజిక వర్గ నేతలే ఎక్కువగా పరిపాలించారు. కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నా ఆ వర్గానికి రాజ్యాధికారం దక్కలేదు.


ఇప్పటివరకు అవకాశం దక్కని వారికి రాజ్యాధికారం కల్పించే విధంగా జనసేన ముందుకు వెళ్తోంది అని పవన్ కల్యాణ్ ప్రకటించారు. ప్రజాస్వామ్యంలో అందరకీ సమాన అవకాశాలు ఉండాలి. కానీ అది జరగడం లేదు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఇది విరుద్ధం. తెలంగాణ మాదిరిగా ఇక్కడ కూడా బీసీలు రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారు. బీసీ సీఎం అనే నినాదాన్ని ఏపీలో కూడా పవన్ డిమాండ్ చేస్తారా అంటే ప్రశ్నార్థకమే.

మరింత సమాచారం తెలుసుకోండి: