భారత్, ఆస్ర్టేలియా మ్యాచ్ అంటేనే హై ఓల్టేజ్ మ్యాచ్. ఈ మ్యాచ్ లో ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మనకు మద్దతిచ్చే వారి సంఖ్యే ఎక్కువ. సహజంగా ఏ భారత అభిమాని అయినా.. రోహిత్ సేన గెలవాలని కోరుకుంటాడు. కానీ భారతదేశంలో పుట్టి మన దేశం ఓడిపోవాలని ఎవరైనా కోరుకుంటారా? కప్పు కంగారు జట్టు సాధించాలని ఆశ పడతారా? ఈ ప్రశ్నలు క్రికెట్ ప్రేమికుల దగ్గరికి వెళ్లి అడిగితే మీకేమైనా పిచ్చా.. అని బదులిస్తారు.
పురుషలందరూ పుణ్య పురుషులు వేరు అన్నట్లు అభిమానమందు పచ్చ అభిమానం వేరయా.. అన్న చందంగా ఉంది టీడీపీ నాయకులు పని. ఇద్దరు టీడీపీ నాయకులు మాట్లాడిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. అందులో ఏముంది అంటే పాకిస్తాన్ ఆస్ర్టేలియా జట్లు మ్యాచ్ ఆడితే ఆసీస్ గెలవాలని కోరకుంటారు. చివరకి ఇండియాతో ఆడినా సరే ఆస్ర్టేలియానే విజయం సాధించాలని కోరుకుంటారు. ఎందుకంటే ఆ జట్టు ధరించే జెర్సీ రంగు పసుపు కలర్ లో ఉంటుంది కాబట్టి అని మహా బాగా సెలవిచ్చారు.
పసుపురంగు అంటే అభిమానం కాబట్టి.. ఆస్ర్టేలియా జట్టును కీర్తించడం అంటే పసుపు అభిమానాన్ని చాటుకోవడం అని అత్యంత గర్వంగా చెప్పాడు. ఇది విన్న పక్కన ఉన్న వాళ్లు తమ చప్పట్లతో అభినందించడం పిచ్చి అత్యంత పరాకాష్ఠకు చేరింది అనడానికి నిదర్శనం. అయితే దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు.