క్షమించడం అనే బాధ్యతను
లేదా ఆ చర్యను ఇప్పుడు
తాలిబన్లు నెత్తిన పెట్టుకోవడం ఓ వింత



శాంతి వచనాల వెల్లువ
ఒకటి యుద్ధ భూమిలో
వినిపించడం కాస్త ఆశించదగ్గ పరిణామం



ఈ మార్పును నిలుపుకోవడం
తాలిబన్ల వంతు
ఈ రోజు తుపాకులు మాట్లాడలేదు
ఇప్పటిదాకా? ఈ నిర్ణయం కొనసాగించే
శక్తి ..చొరవ అన్నీ  ఆ సాయుధ మూకలవే!



అప్రకటిత యుద్ధమో
ప్రకటిత సన్నాహమో



ఏదో ఒకటి జరుగుతోంది
ఆప్ఘనిస్తాన్ లో

వార్ అండ్ పీస్ లో
తొలిసారి శాంతి వచనాలు పలికారు తాలిబన్లు...



శాంతిని నమ్ముకోవడంలో తప్పు లేదు.. శాంతిని పునః స్థాపించడంలో తీసుకునే చొరవను ఎవరు పర్యవేక్షించాలి. అంతర్జాతీయ సమాజం కళ్లు మూసుకుని ఉన్నప్పుడు ఏ చిన్న ఉపశమన చర్య తాలిబన్ల తరఫు నుంచి మొదలయినా మనం తప్పక స్వాగ తించాలి. అలాంటప్పుడే కాస్తయినా శాంతి పర్యవేక్షణకు మార్గం,తీసుకునే చొరవ అన్నవి సుగమం అవుతాయి. దెన్ ఒన్లీ ద  పర్టి క్యులర్ సిట్యువేషన్స్ ఆర్ అక్కర్డ్ ఇన్ వెరీ లిబరల్ వే.. చాలా కాలానికి అమెరికా తన పదవీ వ్యామోహంలోనే మరొకటో కానీ పట్టు వదిలి ప్రపంచంపై ఓ ఉగ్ర పంజానే వదిలిపోయింది. ఇది మనం ఒప్పుకోకూడదు కూడా! కానీ కళ్లుండి చూసి., చెవులుంటే విని రా యాల్సినంత రాత ఒకటి రాయడం లేదు ఎవ్వరూ ఇక్కడ. అంత సీన్ ఇక్కడ ఎవ్వరికీ లేదు. ఎట్టకేలకు పౌర స్వేచ్ఛకు తాము భం గం వాటిల్లనీయమని చెప్పడమే ఆప్ఘన్ల తొలి అడుగు. ఇప్పుడయినా డ్రాప్ ద గన్స్ అని మరో సారి అరవండి ప్లీజ్.



పెద్దన్న దీవెన కావాలె!
అంతా అమెరికా దయ!!
ప్రాణాలు పోయాక లేదా ప్రాణాలు అరచేత పట్టుకుని దేశం దాటి దేశం వస్తున్నప్పుడు శరణార్థులకూ, కాందశీకులకూ కాస్తయినా ఉపశమనం ఇచ్చేందుకు ప్రతి దేశం ముం దడుగు వేయాలి. కానీ ఇక్కడ ఏ దేశం మనుషులను ఆ దేశమే రక్షించలేనప్పుడు మ నం ఇతర దేశాల నుంచి ఆ చొరవ గ్రహించలేం. పొరుగు దేశాలన్నీ ఇప్పుడు తమ స్నేహం సఖ్యత అన్నవి చైనాకు దగ్గరగా ఉండా లి..అని భావిస్తున్నాయి. అలా అని అవి అమెరికా సామ్రాజ్య వాదాన్ని వ్యతిరేకించలేవు.. కానీ రెండు వైపులా ఆయుధాలు అమ్మే నకిలీ వ్యాపారి అయిన అమెరికా పాపం చోద్యం చూస్తాంది. దేశ ప్రధాని మోడీ ఇప్పుడయినా అమెరికాకు వ్యతిరేకంగా మాట్లాడ గలరా?  



.........శుభ పరిణామామే కానీ
ఆయుధాలు వదలండి బాబూ!
పౌర స్వేచ్ఛ, ప్రపంచ స్వేచ్ఛ అని రెండు ఉన్నాయి. ఈ రెండూ ఒక్కటే అన్న భావన మాత్రం అమెరికాలో లేదు.. మోడీలో లేదు..జో బైడెన్ లో కూడా లేదు. ఉంటే మంచిదే! కానీ సాయుధలయి ఉన్న తాలిబన్లు తాము అధికారుల పనులకూ, యంత్రాంగం చేపట్టే కార్యకలాపాలకూ ఎటువంటి విఘాతం కలుగనీయమని చెబుతుండడం కొంతలో కొంత ఉపశమన చర్య. కానీ పిల్లలూ, వా రి తల్లులూ దేనినీ నమ్మలేకపోతున్నారు. ఉన్న పళాన ప్రాణాలు పోతాయన్న బెంగ కన్నా ఏ క్షణం ఏ చర్య తమపై దయ లేకుం డా దాడి జరుగుతుందో అన్న ఆందోళనలోనే వారు కాలం గడుపుతున్నారు. భారత్ కు చెందిన వారంతా లేదా ఇతర దేశాలకు చెందిన వారంతా ఎలా ఉన్నారో అన్న సంశ యంపై ఇప్పటికీ ఓ క్లారిటీ లేదు. కొందరయితే ఇప్పటికే స్వదేశాలకు చేరుకునే చర్య లు చేపట్టినా ఇంకా మిగిలిన వారు తమ ఆఖరి ఆశలు సజీవం చేసుకుంటూనే ఉన్నా రు. కానీ సాయుధులు ఈ రోజు కనికరించి క్షమించేయడం ఓ పెద్ద ఉపశమన చర్య. శుభపరిణామం కూడా!


మరింత సమాచారం తెలుసుకోండి: