1991 నుంచి ఇగ్ నోబెల్ ( ఐజీ నోబెల్ ) అవార్డును ఏటా.. పది అసాధారణ, వింత పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలకు ఇస్తున్నారు. ప్రజలను మొదటగా నవ్వించి, ఆ తర్వాత ఆలోచింపజేసేలా ఉన్న పరిశోధనలను సత్కరించేందుకు ` ఇగ్ నోబెల్ ` అవార్డును అందిస్తున్నారు. ఏఐఆర్ (ఆనల్స్ ఆఫ్ ఇంప్రాబబుల్ రీసర్చ్) మేగజైన్ ఈ అవార్డులు ప్రధానం చేస్తోంది.
31 వ వార్షిక `ఇగ్ నోబెల్` పురస్కార వేడుకలు ఇటీవల వర్చువల్‌గా నిర్వహించారు. ఇందులో వేర్వేరు విభాగాల్లో అవార్డలను అందజేశారు. విజేతల్లో
బయోలజీ : మనిషి, పిల్లి మధ్య ఉండే సమాచార వ్యవస్థపై పరిశోధనలు జరిపిన సుసేన్ స్కాట్జ్కు బయోలజీ విభాగంలో ఈ అవార్డు దక్కింది.
ఎకాలజీ : ప్రపంచవ్యాప్తంగా రోడ్ల మీద ఉమ్మిన చూయింగ్ గమ్లను సేకరించి, జన్యు విశ్లేషణతో వాటిలోని బ్యాక్టీరియాను గుర్తించిన లైలా సటారా, ఆల్బా గుయిలెన్, ఏంజెలో విడాల్, మాన్యుయెల్ పోర్కర్ కు ఇగ్ నోబెల్ దక్కింది. వీటి ఫలితాలు భవిష్యత్తులో ఫోరెన్సిక్ పరిశోధనలకు ఉపయోగపడుతాయి.
ఇలా కెమిస్ట్రీ , ఎకనామిక్స్, మెడిసిన్, ఫిజిక్స్, ఎంటమాలాజీ, శాంతి పురస్కారం ఇలా పలు విభాగాల్లో పరిశోధనలు చేసిన పరిశోధకులకు ఈ ` ఇగ్ నోబెల్ ` అవార్డును అందజేస్తూ వస్తున్నారు.