ప్ర‌స్తుతం ఉన్న జీవన విధానం.. ఆహార నియ‌మాలు, రోగాల‌తో మ‌నిషి స‌గ‌టు ఆయువు త‌గ్గిపోతోంది. ఇక రానున్న రోజుల్లో మ‌రింత దిగ‌జారిపోతుంద‌న్న అంచ‌నాలు వ్య‌క్తం అవుతున్న వేళ మ‌నుషులు 100 ఏళ్లు కాదు 180 సంవ‌త్స‌రాలు జీవిస్తార‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. మనుషులు 100 సంవ‌త్స‌రాలు దాటి 180 ఏళ్లు జీవిస్తారని అది కూడా 2100 సంవ‌త్స‌రం లోపు మ‌నుషుల ఆయుర్ధాయం పెరుగుతుంద‌ని కెనడాకు చెందిన సైంటిస్టులు ఛాలెంజ్‌ విసురుతున్నారు. డైలీ మెయిల్ లోని ఒక నివేదిక ఆధారంగా.. కెనాడాలోని మాంట్రియ‌ల్‌లోని హెచ్ఈసీ యూనివ‌ర్సిటీకి చెందిన సైంటిస్టులు మాన‌వుడి ఆయుర్ధాయంపై కొంతకాలంగా ప‌రిశోధ‌న కొన‌సాగిస్తున్నారు.


2100 సంవ‌త్స‌రం లోపు అత్యంత ఎక్కువ వ‌య‌సు ఉన్న వ్య‌క్తి రికార్డును అధిగ‌మించ‌చ్చొని అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ లియో బెల్‌జిలె వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం అత్యంత ఎక్కువ కాలం జీవించిన మ‌నిషిగా ఫ్రెంచ్ కు చెందిన‌ జీన్ కాల్మెంట్ అనే మ‌హిళ రికార్డు సృష్టించింది. 122 ఏళ్లు జీవించిన కాల్మెంట్‌ 1997లో మ‌ర‌ణించింది. ఆమె త‌రువాత‌ 122 ఏళ్లు ఎవ‌రూ జీవించ‌లేదు. కెనడా శాస్త్ర‌వేత్త‌ల నమ్మకం ప్రకారం ఒక‌వేళ మ‌నిషి ఆయుర్ధాయం పెరిగితే మాత్రం దాని వ‌ల్ల ప్ర‌పంచంలో చాలా మార్పులు చోటు చేసుకోవటం ఖాయ‌మ‌ని అంచ‌నా వేస్తున్నారు.


 మనిషి ఆయుర్ధాయం పెరిగితే సంభ‌వించే మార్పుల గురించి.. ప్రొఫెసర్ ఎలీన్ మాట్లాడారు. మనిషి జీవితకాలం పెరిగితే వారికి  వైద్య ఖర్చులు చాలా ఎక్కువగా పెరుగుతాయ న్నారు.  వారి మోకాళ్లు, తుంటి ఎముకలు, కార్నియాలు, గుండె కవాటాలను భర్తీ చేయటానికి భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి వ‌స్తుంద‌ని వెల్ల‌డించారు. మనుషుల ఆయుష్షు పెరుగుద‌ల‌ మీద ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ప‌రిశోధ‌నల ఆధారంగా..  ఒక మ‌నిషి 110 ఏళ్లు జీవిస్తాడ‌ని అనుకుంటే.. అందులో 50 సంవ‌త్స‌రాలు నిండ‌గానే మ‌ర‌ణించే ప్ర‌మాదం కూడా పెరుగుతూ వ‌స్తుంది.  80 ఏళ్లు వ‌చ్చాక చ‌నిపోయే ప్ర‌మాదం త‌గ్గుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: