విల‌క్ష‌ణ న‌టుడు తిరుమల సుందర శ్రీరంగనాథ్ (జూలై 17, 1949 - డిసెంబర్ 19, 2015). రంగ‌నాథ్‌గా సినీ ప్రేక్ష‌కుల గుండెల్లో నిలిచిపోయారాయ‌న‌. గంభీరమైన స్వరం...ఆకట్టుకునే రూపం... కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా, కేరెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఆయన అటు సినిమా, ఇటు టెలివిజన్‌లో కనిపించి మెప్పించారు. అంతేనా? ఆయన స్వతహాగా కవి. ఎన్నో కవితలు రాసి పుస్తక రూపంలో తెచ్చారు.ఏ పాత్రలోనైనా ఇట్టె ఇమిడిపోయే నటనంతో నిన్నటి తరం ప్రేక్షకులను ఎంతగానో అలరించిన న‌టుడాయ‌న‌. సాధార‌ణంగా ఆనాటి సినిమా ప్రేక్ష‌కుల‌కు రంగనాధ్‌ పేరు చెప్పగానే ‘పంతులమ్మ’, ‘జమీందారుగారమ్మాయి’, ‘అందమే ఆనందం’, ‘అమెరికా అమ్మాయి’, ‘రామచిలుక’, ‘ఇంటింటి రామాయణం’...ఇలా అనేక మంచి చిత్రాలు జ్ఞాపకమొస్తాయి.  


రంగ‌నాథ్ 1949లో మద్రాసు నగరంలో టి.ఆర్.సుందరరాజన్, జానకీదేవి దంపతులకు జన్మించాడు. రంగ‌నాథ్ కుటుంబంలో ఎవ‌రు సినీ నేప‌థ్యం ఉన్న వారు కాక‌పోవ‌టంతో రంగ‌నాధ్ బాల్యం అంతా సాధారణంగానే గ‌డిచింది. తాతగారి ఇంట్లో ఆయన పెరిగారు. రంగనాధ్ బాల్యంలోని తాతగారింట వాతావరణం ఆయనను కళాకారుడిగా మారేలా చేసింది. తాతగారి ఇంట్లో అందరూ గాయకులు కావడంతో రంగానాధ్ కూడా ఏదో ఒక కళలో రాణించాలి అనే నిర్ణయానికొచ్చారు. అదే ఉద్దేశంతో చిన్నతనంలో నాటకరంగం వైపు వచ్చారు. అనేక నాటకాలలో వివిధ పాత్రలను వేసారు. అక్కడినుంచి సినీరంగం వైపు రావాలనే ఆకాంక్ష మొదలైంది. వారి తల్లి ప్రోత్సాహంతో ఈ కోరిక మరింత బలపడింది. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ చేశాడు. 


 సినిమాల‌కు రాక ముందు రైల్వేశాఖలో టికెట్ కలెక్టర్‌గా కొంతకాలం పనిచేశాడు. 1969లో బుద్ధిమంతుడు సినిమాతో వెండితెరకు పరిచ‌మ‌య్యారు. ఇక ఆ త‌ర్వాత వ‌రుస ఆఫ‌ర్ల‌తో  సుమారు 300 సినిమాల‌కు పైగా న‌టించడం గ‌మ‌నార్హం. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ నటుడిగా సినిమా ప్రేక్షకులను మెప్పించాడు. మొగుడ్స్ పెళ్లామ్స్ చిత్రానికి దర్శకత్వం వహించాడు. కొన్ని టీ.వీ.సీరియళ్లలో కూడా నటించాడు. రంగనాథ్ నటుడే కాదు మంచి కవి, రచయిత కూడా. వీరు రచించినకవితా సుదర్శనం, అంతరంగ మథనం, ఈ చీకటి తొలగాలి, పదపరిమళం, అక్షర సాక్ష్యం, రంగనాథ్ కథలు, రంగనాథ్ నడత పుస్తకాలు అచ్చయ్యాయి. వీరు డిసెంబరు 19, 2015 న హైదరాబాదు లోని తన స్వగృహంలో ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. మరణించే ముందు గుడ్ బై సర్ అంటూ తన మిత్రుడు బైస దేవదాస్ గారికి సందేశం పంపారు. తనకు వంటచేసే పనిమనిషి మీనాక్షికి బీరువాలో దాచిన ఆంధ్రభ్యాంకు బాండ్లు అందవలసినదిగా గోడలపై రాసి డోంట్ ట్రబుల్ హర్ అంటూ తెలియజేసారు.

 

కవితా సుదర్శనం, అంతరంగ మథనం, ఈ చీకటి తొలగాలి, అక్షర వేదికలు, పదపరిమళం, నడత’ తదితర పుస్తకాలు ప్రచురించారు. ఎవరు మంచి వ్యాసం, ఇంట ర్వ్యూ రాసినా ఫోన్ చేసిమరీ అభినందించ‌డం ఆయ‌న‌కు అల‌వాటు. ఆయన భార్య ప్రమాదవశాత్తూ బాల్కనీ నుంచి కింద పడి, 14 ఏళ్ళ పాటు మంచానికే పరిమితమైపోతే కట్టుకున్నవాడే కన్నబిడ్డలా సపర్యలు చేశాడు. కానీ, గొప్ప చెప్పుకోలేదు. ‘నాలో సగభాగమైన భార్యకు చేయడం సేవ ఎందుకవుతుంద’నేవారు. 2009లో ఆమె కన్ను మూశారు.ఆమె ఫోటోను దేవుడి పటాలతో పాటు చేర్చి పూజ చేసేవారు. ఆ పటం పైన డిస్టినీ అని రాసుకున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: