గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ లోకాన్ని విడిచి వెళ్లిన విషయాన్ని ఇప్పటికీ ఏ ఒక్కరూ జీర్ణించుకో లేకపోతున్నారు. అభిమానులు, సన్నిహితులు, స్నేహిఈ కార్యక్రమంలో ప్రఖ్యాత గాయకులు, కళాకారులు పాల్గొన్నారు. స్నేహితులు, సినీ ప్రముఖులు బాలుతో తమ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ కంటతడి పెడుతున్నారు. ఈ క్రమంలో బాలుకు ఘనంగా శ్రద్దాంజలి ఘటిస్తూ చెన్నైలో సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా బాలు కుమారుడు ఎస్పీ చరణ్ మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తమిళులు, తెలుగు వారు అలాగే ఇతర భాషల వారు నన్ను తిట్టుకుంటారేమో గానీ నాన్న గారి అభిమానులు అన్ని భాషల్లో ఉన్నారు కాబట్టి అందరికీ కామన్ భాష అయిన ఇంగ్లీష్‌లో నేను మాట్లాడాలనుకుంటున్నాను అంటూ స్టార్ట్ చేసిన చరణ్.. బాలు జ్ఞాపకాలు, ఆయనతో అనుబంధం తదితర విషయాలపై స్పందిస్తూ ఎమోషనల్ అయ్యారు. నాన్నకు ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తానని గానీ, ఇలాంటి సభలో ఇలా మాట్లాడుతానని అనుకోలేదని అన్నారు. చాలా దురదృష్టకరం అంటూ భావోద్వేగం చెందారు.


తన జీవితంలో జరుగాల్సింది జరిగిపోయిందని.. నాన్న గారు తనపై ఇలా బాధ్యతలు పెట్టి వెళ్ళిపోతారని ఊహించలేదని చరణ్ తెలిపారు. ఏదో ఒక సందర్భంలో అరెయ్ ఇక నేను రిటైర్ అవుతున్నా.. ఇక అన్నీ నువ్వేచూసుకో అంటారేమో అనుకొన్నాను. కానీ ఆ రోజు రూపంలో వస్తుందనుకోలేదు. తీరని బాధను మిగిల్చారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంత ఏడిస్తే మనసు బలంగా మారుతుందని అనుకుంటున్నా. ఈ బాధ నుంచి త్వరగా బయటపడి నాన్న నాపై పెట్టిన బాధ్యతలను నెరవేర్చాలనుకొంటున్నాను అంటూ చరణ్ కంటతడి పెట్టుకున్నారు.


ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా వైరస్ సోకడంతో ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చేర్పించారు. మొదట జలుబు, జ్వరం వంటి స్వల్ప లక్షణాలు ఉన్నప్పటికీ, ఆగస్టు 13వ తేదీన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆ రోజు నుంచి ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందించి చివరకు ఈసీఎంవో (ఎక్స్‌ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సీజనేషన్) సపోర్ట్‌తో చికిత్స అందించారు. ఆ తర్వాత ఆయన కరోనా నుంచి కోలుకున్నప్పటికీ.. తిరిగి ఆరోగ్యం క్షీణించడంతో సెప్టెంబర్ 25న కన్నుమూశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: