మాలవ్యా భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షునిగా నాలుగు సార్లు (1909 & 1913,1919,1932) పనిచేశారు. ఆయన 1934లో కాంగ్రెస్ ను విడిచిపెట్టారు. ఆయన హిందూ మహాసభలో ముఖ్యమైన నాయకునిగా కూడా ఉన్నారు. మాలవ్యా "భారతీయ స్కౌట్స్ , గైడ్సు"కు ఒక వ్యవస్థాపకుడు. ఆయన 1909 లో అలహాబాదు నుండి వెలువడుతున్న ఆంగ్ల పత్రిక లీడర్ పత్రికను స్థాపించారు. ఆయన 1924 నుండి 1946 వరకు హిందూస్థాన్ టైమ్స్కు చైర్మన్ గా ఉన్నారు. ఆయన సేవలు 1936 లో హిందీ ఎడిషన్ ప్రారంభానికి ఉపయోగపడ్డాయి.మాలవ్యా భారతదేశంలోని ప్రతిష్ఠాత్మక అవార్డు అయిన భారతరత్నకు డిసెంబర్ 24,2014 న ఎంపికైనారు. ఈ అవార్డును ఆయన 125 వ జన్మదినం ముందుగా పొందారు.
బ్రిటిష్ రాజ్యంలో భారత భవిష్యత్తును నిర్థారించడానికి ఏర్పాటైన సైమన్ కమీషన్ను వ్యతిరేకించడానికి లాలా లజపతి రాయ్, జవహర్ లాల్ నెహ్రూ ఇంకా ఇతర స్వాతంత్ర్య సమరయోధులతో కలిశాడు. 1931లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మహాత్మా గాంధీతో కలిసి కాంగ్రేసు పార్టీకి ప్రాతినిధ్యం వహించాడు. 1922-23 లో హిందు మహాసభ అధ్యక్షుడుగా చేశారు. "సత్యమేవ జయతే" అనే నినాదాన్ని వ్యాపింపచేసాడు. అతడు గొప్ప విద్యావేత్త, కర్మయోగి, భగవద్గీతను పాటించెను. సమకాలిక నాయకుల వలే కులమత భేదములను పోగొట్టడానికి ప్రయత్నించాడు. దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న అవార్డును కేంద్ర ప్రభుత్వం మదన్ మోహన్ మాలవ్యాకు 2014లో ప్రకటించింది. ఈయనతోపాటు భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు వాజ్‌పేయీకి భారతరత్న ప్రకటించింది.