మహామంత్రి తిమ్మరుసు, శ్రీకృష్ణావతారం, భలేతమ్ముడు, మనుషుల్లో దేవుడు, ఆరాధన లాంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించాడు. మహమ్మద్ రఫీని తెలుగు శ్రోతలకు దగ్గరైంది ఈయన సినిమాల ద్వారానే. కర్తవ్యం సినిమాలో విలన్ గా నటుడిగా తెరమీదకు వచ్చాడు.కర్తవ్యం సినిమా కోసం బయటకు చూడ్డానికి సౌమ్యంగా కనిపిస్తూ లోపల విలనీ ఆలోచనలుండే ఒక పాత్రను పరుచూరి బ్రదర్స్తో రాయించారు మోహన గాంధీ. ఆ వేషం వేయాల్సిందిగా ఏ.యం.రత్నం పుండరీకాక్షయ్యను కోరాడు. ఆయన మొదట్లో ఒప్పుకోకున్నా, తరువాత బలవంతంగా ఒప్పించారు. తరువాత శివయ్య, పోలీస్ బ్రదర్స్, బ్రహ్మ మొదలైన 20 తెలుగు, 5 కన్నడ సినిమాల్లో నటించాడు.
సినిమాని కమర్షియల్ గా తీసినా జనానికి సందేశం ఇవ్వాలన్నది ఆయన పాలసీ. అయితే రామారావుని అర్జునుడిగా, నాగేశ్వరరావును కృష్ణుడిగా పెట్టి నరనారాయణ అను శ్రీకృష్ణార్జునులు అనే సినిమా తీయాలని ఉన్నా అది కలగానే మిగిలిపోయింది. కొంతకాలం అనారోగ్యంతో బాధపడిన పుండరీకాక్షయ్య చెన్నై లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2012, ఫిబ్రవరి 2 గురువారం నాడు ఉదయం ఆరు గంటలకు కన్నుమూసారు. దర్శకుడి పర్యవేక్షణ అన్నింటిమీద ఉన్నా, పుండరీకాక్షయ్య దర్శకుడికి సహాయకుడిగా, తన ఆలోచనలు కూడా జోడిస్తూ, నిర్మాణ సక్రమ విధానానికి దోహదం చేసేవారట. ‘మహామంత్రి తిమ్మరుసు’. 1962లో ‘ఉత్తమ తెలుగు చిత్రం’గా రాష్ట్రపతి రజత పతకం తెచ్చుకుంది. నాటి రాష్ట్రపతి ప్రత్యేకంగా చిత్రాన్ని తెప్పించుకొని మూడుసార్లు చూశారంట.