
అష్టా చమ్మా హీరోయిన్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది స్వాతి. అందులో రెండవ హీరోయిన్ గా భార్గవి నటించిన విషయం చాలా మందికి తెలియదు. అయితే భార్గవి అతి చిన్న వయసులోనే తన ప్రాణాలను కోల్పోయింది. భార్గవి 1983 వ సంవత్సరం లో రాజేంద్రప్రసాద్ కోలా, భానుమతి దంపతులకు గుంటూరు జిల్లా గోరంట్ల గ్రామం లో జన్మించింది. ఈమె మొదట 2005లో రామ్ హీరోగా, ఇలియానా హీరోయిన్ గా తొలి పరిచయమైన దేవదాసు చిత్రం ద్వారా భార్గవి కూడా తెలుగు సినిమా రంగంలోకి ప్రవేశించింది.
ఇక దేవదాసు చిత్రం మంచి విజయం సాధించడంతో ఈమెకు కూడా మంచి గుర్తింపు వచ్చింది. దేవదాసు చిత్రం తరువాత మా ఊరి వంట, ఆట వంటి జీ తెలుగు కార్యక్రమాలతోపాటు.. అమ్మమ్మ .కాం, అమృతం వంటి దారావాహికలలో కూడా నటించి , తనకంటూ ప్రేక్షకులలో చెరగని ముద్ర వేసుకుంది. ఆ తర్వాత అన్నవరం, రక్షా, హాలిడేస్ ,అంజనీ పుత్రుడు, మిస్టర్ మేధావి, పాండురంగడు వంటి చిత్రాలలో కూడా నటించింది. ఇక 2008లో నాని హీరోగా, స్వాతి హీరోయిన్ గా తెరకెక్కిన అష్టాచమ్మా చిత్రంలో రెండవ హీరోయిన్ గా భార్గవి స్థానం సంపాదించుకుంది.
అటు వెండి తెర పైన ఇటు బుల్లితెర పైన మంచి స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న భార్గవి అనతికాలంలోనే జీవితాన్ని ముగించుకుంది. భార్గవి 2006 ఫిబ్రవరి 12న నెల్లూరులోని మురళీకృష్ణ హోటల్ లో ప్రవీణ్ అనే వ్యక్తిని స్నేహితుల సమక్షంలో ప్రవీణ్ - భార్గవి ల వివాహం జరిగింది. కానీ భార్గవి 2008 డిసెంబర్ 16న హైదరాబాద్ బంజారాహిల్స్ లోని తన స్వగృహంలో తన భర్త ప్రవీణ్ చేతిలో హత్యకు గురైంది. కానీ ఈమె చనిపోవడం వెనుక ఉన్న కారణాలు ఏమిటో ఇప్పటి వరకు తెలియలేదు. ఇక భార్గవిని చంపిన ప్రవీణ్ , ఆ తర్వాత అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు..
2002 నుండి అంటే ప్రవీణ్ గత ఐదు సంవత్సరాలుగా ఒక సంగీత ఆర్కెస్ట్రాను నడుపుతున్నారు. అయితే ఇతనికి గతంలోనే రెండుసార్లు వివాహం జరిగింది. మొదటి పెళ్ళి మాజీ డి.ఎస్.పి కుమార్తె డాలి తో అలాగే రెండవ పెళ్ళి సుబ్బు చిత్రంలో నటించిన స్వప్నతో.. వీరిద్దరితో ముందే పెళ్లి కావడం, విడిపోవడం కూడా జరిగింది. ఆ తర్వాత భార్గవి ని పెళ్లి చేసుకోవడం కూడా జరిగింది. కారణాలో ఏవో తెలియదు కానీ భార్గవి ను హత్య చేశాడు ప్రవీణ్.. ఇతడి మూర్ఖత్వం వల్ల ఒక మంచి నటిని కోల్పోయింది సినీ ఇండస్ట్రీ.