సినీ ఇండస్ట్రీలో కొంత మంది కొన్ని రికార్డులు సృష్టించి చరిత్ర సృష్టిస్తూ ఉంటారు. ఇక మరికొంతమంది కేవలం నటనకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తారు. కొంతమంది తమ నటనతో అందరిని ఆకర్షించడమే కాదు, అనేక చిత్రాలలో నటించి, రికార్డు స్థాయిలో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లో కూడా ఎక్కుతారు. అలాంటి వారిలో మనోరమ కూడా ఒకరు. 1987లో ప్రపంచంలోనే అత్యధిక సినిమాలలో నటించిన సినీ నటి గా గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించింది. అయితే 2009 వరకు ఈ స్థానాన్ని ఎవరూ అధిగమించలేదు.


ముఖ్యంగా ఈమె ఐదుగురు ముఖ్యమంత్రులతో కలిసి నటించింది అని చెప్పడం అతిశయోక్తి కాదు. మాజీ సీఎం అన్నాదురై, ఎంజీ రామచంద్రన్, కరుణానిధి తో పాటు నందమూరి తారక రామారావు తో కూడా కలిసి నటించింది. ఇక అంతే కాదు సూపర్ స్టార్ హీరోలైన శివాజీ గణేషన్, రజనీకాంత్, కమల్ హాసన్ తో ఎక్కువ గా నటించారు. మనోరమ మే 26 1937 వ సంవత్సరంలో జన్మించారు. ఇక ఈమె 1958లో తమిళంలో "మూల ఇట్టా మంగై " చిత్రం ద్వారా తమిళంలో అరంగేట్రం చేసింది.

ఇక తర్వాత సుమారు 1500 సినిమాలు, 1000 నాటక ప్రదర్శనలు కూడా ఇచ్చి రికార్డు సృష్టించారు. ఈమెను అభిమానులు ముద్దుగా ఆచి అని పిలుచుకునేవారు. ముఖ్యంగా మనోరమ తెలుగులో బాగా అందరిని మెప్పించిన సినిమా అరుంధతి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు . 2009లో అనుష్క లేడీ ఓరియంటెడ్ చిత్రంగా వచ్చిన అరుంధతి సినిమాలో నటించి , అందరి చేత మన్ననలు పొందింది. ఇక తెలుగులో ఏకంగా 15 సినిమాలలో నటించినా,  అన్ని చిత్రాలలోనూ విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.


ఇక ముఖ్యంగా 1988లో ఉత్తమ సహాయ నటిగా భారత జాతీయ చలనచిత్ర పురస్కారం అందుకోవడం , ఆ తర్వాత 2002లో పద్మశ్రీ పురస్కారం కూడా అందుకుంది. ఇక  ఆ తరువాత కళైమామణి పురస్కారం కూడా పొందడం మరో విశేషం. ఇక ఇన్ని రికార్డులు సాధించిన మనోరమ , గత కొంత కాలం నుండి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ , చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ , అక్టోబర్ 11 2017 న తుదిశ్వాస విడిచారు. ఈమె మరణంతో సినీ ఇండస్ట్రీ మూగబోయింది.. ఇంతటి మహోన్నత మైన నటి మరొకరు లేరు. ఇంకెవరు ఆమె స్థానాన్ని పూరించలేరని అనడంలో ఎలాంటి సందేహం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: