సినీ ఇండస్ట్రీలో విలన్ పాత్రలలో అదరగొట్టి, ప్రేక్షకులను మెప్పించిన ఎంతోమంది నటులలో రావు గోపాల్ రావు కూడా ఒకరు. తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. రావు గోపాల్ రావు 1937 జనవరి 14 వ తేదీన కాకినాడ దగ్గర లోని గంగనపల్లి లో జన్మించారు. రావు గోపాల్ రావుకి చిన్నప్పటి నుండి నటన మీద ఆసక్తి ఉండడంతో నాటక రంగంలోకి ప్రవేశించారు. అసోసియేటెడ్ అమెచూర్ నాటక సంస్థను స్థాపించిన ఈయన , దాని ద్వారా ఎన్నో సాంఘిక నాటకాలను ప్రదర్శించాడు. మొదటిసారిగా 1966 గుత్తా రామినీడు దర్శకత్వం లో రూపుదిద్దుకున్న భక్త పోతన సినిమాలో శ్రీనాథుని పాత్ర పోషించాడు. ఇక ఈ చిత్రంలో ఆయన నటనకు గాను రామినీడు తమ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్గా రావుగోపాలరావును నియమించుకున్నాడు.
ఇలా ఆయన సినీ ప్రస్థానం ఒక నటుడిగా, అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక విలక్షణ నటుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఆ తర్వాత నిర్మాతగా కూడా కొన్ని సినిమాలకు వ్యవహరించాడు. ఆయన నిర్మించిన అనేక చిత్రాలలో భార్గవ రాముడు ,లారీ డ్రైవర్, స్టేషన్ మాస్టర్ , వింత దొంగలు వంటి చిత్రాలు మంచి ప్రేక్షకాదరణ పొందాయి. 1966 హరికథా కళాకారిణి అయినటువంటి కమల కుమారిని జనవరి 16వ తేదీన పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు . ఇద్దరు కుమారులు ,ఒక కుమార్తె. అందులో ఒక కుమారుడు రావు రమేష్ కూడా మంచి నటుడిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు.
రావు గోపాలరావు భార్య కమల కుమారి తన 73 సంవత్సరాల వయసులో ఏప్రిల్ 6 2018 తేదీన హైదరాబాద్ లో మరణించారు. అంతేకాకుండా రావు గోపాల్ రావు నటించిన ఎన్నో చిత్రాలకు గానూ 1990 సంవత్సరం లో కళాప్రపూర్ణ (గౌరవ డాక్టరేట్) ను ప్రధానం చేశారు. ఇంకా అనేక నాటక సంస్థలు ఈయనకు నట విరాట్ అనే బిరుదును కూడా అందించాయి. అంతేకాకుండా నంది అవార్డులు, చిత్తూరు నాగయ్య పేరుతో ఇచ్చే బహుమతులు, సితారా బహుమతులు కూడా అందుకున్నారు. 1984 నుండి 1985 వ సంవత్సరం లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యులుగా కూడా పనిచేశారు . ఇక రాజ్యసభ సభ్యుడిగా కూడా 1986 నుంచి 1992 వరకు పనిచేశారు. ఇక చివరిగా మధుమేహవ్యాధి ఎక్కువై, కిడ్నీలు చెడిపోవడంతో 1994 ఆగస్టు 13వ తేదీన స్వర్గస్తులయ్యారు.