పుష్పవల్లి ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా (ఆ సమయంలో మద్రాసు ప్రెసిడెన్సీలో ) పెంటపాడు గ్రామంలో కందాల రామకోటమ్మ, కందాల తాతాచారి దంపతులకు జన్మించింది. ఆమె అసలు పేరు కందాల వెంకట పుష్పవల్లి తాయారమ్మ.
పుష్పవల్లి 9 సంవత్సరాల వయస్సులో చిత్ర పరిశ్రమలో తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆమె సంపూర్ణ రామాయణం (1936)లో సీత పాత్రను పోషించింది. పుష్పవల్లి మొదటి జీతం మూడు రోజుల షూట్ కోసం రూ. 300. ఆ సమయంలో ఆమె అగ్ర నటి. షూటింగుల వల్ల ఆమె ప్రాథమిక విద్య మాత్రమే పూర్తి చేశారు.
రేఖ తల్లి 1940లో IV రంగాచారి అనే న్యాయవాదిని వివాహం చేసుకుంది. తరువాత వాళ్ళు విడిపోయినట్లు వార్తలు వచ్చాయి. పుష్పవల్లి 1947లో 'మిస్ మాలిని' సెట్స్‌లో జెమినీ గణేషన్‌ను కలిశారు. ఆ తర్వాత చక్రధారి (1948) సినిమాలో కూడా కనిపించారు. తరువాత వీరిద్దరూ వివాహం చేసుకోకుండానే కలిసి ఉన్నారు. కొన్నేళ్ల తరువాత ఇద్దరూ విడిపోయారు.
1995లో పుష్పవల్లి భాగస్వామి జెమినీ గణేశన్ ప్రముఖ నటి సావిత్రిని వివాహం చేసుకున్నారు. ఆ సమయంలో మహిళలకు విడాకులు అనుమతించబడని కారణంగా పుష్పవల్లి జెమినిని వివాహం చేసుకోలేకపోయింది. కానీ అదే ఆమెకు మంచిది అయ్యింది. ఎందుకంటే సావిత్రి పరిస్థితి ఏమయ్యిందో తెలిసిందే కదా ! లేదంటే సావిత్రి పరిస్థితిలో పుష్పవల్లి ఉండేదేమో... ఆమె చివరి చిత్రం 1969లో వచ్చిన 'బంగారు పంజరం'. ఈ చిత్రంలో పుష్పవల్లి చాలా చిన్న పాత్రలో నటించారు. పుష్పవల్లికి మొత్తం 5 మంది పిల్లలు... అందులో ఇద్దరు జెమిని కుమార్తెలు. ఆమెకు ఒక కుమారుడు బాబ్జీ, కుమార్తెలు రమ, ధనలక్ష్మి, రేఖ, రాధ. పుష్పవల్లి 1992లో మధుమేహం కారణంగా మద్రాసులో మరణించింది.