2016 సంవత్సరం మేష రాశి ఫలితాలు
దనిష్ట 3,4 పాదములు, శతభిష 1,2,3,4 పాదములు, పూర్వభాద్ర 1,2,3 పాదములు
పేరులోని మొదటి అక్షరము - గు,గే,గో,సా,సీ,సూ,సే,సో,దా పుట్టిన రోజు - జనవరి 20 th నుండి ఫిబ్రవరి 18th
సంబంధిత కాలం
|
ఆదాయం
|
వ్యయం
|
రాజపూజ్యం
|
అవమానం
|
జనవరి 1 నుంచి ఏప్రిల్ 7 వరకు
| 5 | 2 |
5 | 4 |
ఏప్రిల్ 8 నుంచి డిసెంబర్ 31 వరకు
| 8 |
8
| 3 | 5 |
ఈ రాశి స్త్రీ పురుషదులకు యోగ కారకుడైన గురువు సింహంలో 7 వ ఇంటి, 8వ ఇంట సంచారము. శని 10 ఇంట ఉండుటచే మీ గృహ కుటుంబ పరిస్థితులు సాంఘిక ముగా ను, గృహ సంబంధముగాను కోంతసౌఖ్యం కలిగించును. ప్రథమార్థంలో బాగుంటుంది. ఏ పని తలపెట్టిన అవలీలగా పూర్తి చేస్తారు. గురు ప్రభావంచే అగ్ని భయం, దొంగల వల్ల భయం, వృథాగా శ్రమపడుట. ప్రయాణములందు కష్టములు, నష్టములు, ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు. నామ, జపంవ్రతముచే వెలుగు నీడలుగా పరిణమించిన జీవితం ధన్యతనొందును. మీ ఆరోగ్యం చక్కగా చూసుకునేది. గర్భస్థ సంబంధ భాదలు, మతిస్థిమితం లేక ఏమీ మాట్లాడుతున్నారో మీకు తెలియన స్థితిగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఎక్కడికి వెళ్లినా గౌరవ మర్యాద లకు లోటు రాదు. ప్రతి పనిలో లాభదాయకంగా కనిపించినా లోలోప పడే భాదలు దేవుడికి ఎరుక అన్ని విధంగా ఉండును. అధికార వర్గం, బంధు వర్గ రిత్యా సంఘంలో పేరు ప్రఖ్యాతలు ఉండును. ఎంత కష్టపడి సంపాదించినా ఏనుగుమ్రింగిన వెలగ పండు మాదిరి అనిపించును. మీలో గల మంచితనం వల్ల ఎంతటి గడ్డు సమస్యలైనా తప్పించుకొంటారు. గౌరవం నిలబడినా ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు.
మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు ఆగస్టు వరకు పరిస్థితులు అనుకూలం.. తదుపరి 8 వ ఇంట గురుని ప్రభావం చేత ఊహించని సమస్యలు జీవితంలో మరిచిపోలేని సంఘటనలు జరుగును. మీ శక్తి సామర్థ్యాలు మిమ్ముల్ని రక్షించలేవు.
ధనిష్ట 3,4 పాదముల వారు : ఇంటా బయట సుఖ సంతోషములు, ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు. అకారణంగా ఇతరులతో గొడవ పడవలసి వస్తుంది. సంభాషణలయందు జాగ్రత్త అవసరం. అనవసరపు ఆందోళనలు భయాలను వీడనాడండి. దైవ చింతన పెంచుకోండి.
శాంతులు : చంద్ర, గురు, శుక్రులకు జపములు, శని, రాహులకు శాంతి చేయించుకోండి
శతభిషం 1,2,3,4 పాదముల వారు : వ్యాపారస్తులు జాగ్రత్తగా కొనుగోళ్లు, అమ్మకాలు జరపాలి. సంతాన విషయంలో పూర్తి స్థాయిలో మనసు పెడతారు. సూక్ష్మబుద్ది కలిగి వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. పరాక్రమం ప్రదర్శిస్తారు. శారీరక మానసిక సంతోషం కలుగును.
శాంతులు : బుధ,రాహువులకు జప మాలలు, చంద్ర, గురు,కేతువులకు శాంతి చేయించుకోండి
పూర్వాభాద్ర 1,2,3 పాదముల వారు : శుభ కార్యములు చక్కగా జరుపుతారు. ముఖ్యమైన వ్యక్తుల సహాయ సహకారాలు ఉన్నా ఆర్థిక పరమైన ఇబ్బందులు తప్పవు. దూర ప్రయాణాలకు జాగ్రత్త అవసరం. ఉదర సంబంధమైన అనారోగ్యం సమస్యలు బాధించును.
శాంతులు : శుక్రునికి జపములు , కుజ,కేతువులకు శాంతులు చేయించుకోండి
కుంభరాశి నెలవారి ఫలితాలు :
2016
కుంభరాశి రాశి వారి 2016 సంవత్సరం నెలల వారి ఫలితాలు
January
|
|
February
|
|
March
|
|
April
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
|
|
|
|
|
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
May
|
|
June
|
|
July
|
|
August
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
|
|
|
|
|
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
September
|
|
October
|
|
November
|
|
December
|
జనవరి 2016 : విదేశీయానం, వృత్తి, ఉద్యోగాలలో సానుకూలo. సత్కారాలు పొందుతారు.
వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. జూలై 2016 గురు బలం బాగా ఉన్నందున వివాహాది శుభకార్యాలు, విదేశీయానం, వృత్తి, ఉద్యోగాలలో సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. రాజకీయ కళా రంగాల వారికి పదవీ యోగం సన్మానాలు, సత్కారాలు పొందుతారు. కోర్టు కేసుల నుంచి బయట పడుతారు. ప్రముఖల నుండి ఆహ్వానాలు అందుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ది చెంతుదాయి. ఆస్తి వ్యవహారాలు తీరి లబ్ది పొందుతారు. గృహ నిర్మాణాలు ఆలోచనలు ఫలిస్తాయి.
కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాలల్లో పాల్గొంటారు. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. విద్యా వైద్య పారిశ్రామిక రంగాల వారికి అనుకూలంగా ఉంది. సంతాన విషయంలో పురోగతి సాధిస్తారు. స్థలాలు, భూములు కొనుగోలు చేస్తారు. వివాహాది శుభకార్యాలు ఫలిస్తాయి. విదేశీ యానాలకు అవకాశాలు లభిస్తాయి. తెల్ల జిల్లేడు వత్తులతో గణపతి దేవున్ని పూజ చేయండి. శతృపీడ , నరదిష్టి తొలగును, ప్రభుత్వ పరంగా రావాల్సిన ప్రయోజనాలు దక్కుతాయి.
పరిష్కారములు : కుజ, బుధ,శుక్ర,శని, రాహు,కేతు గ్రహములకు శాంతులు
ఫిబ్రవరి 2016 : నూతన వ్యాపారాలు, వృత్తి వ్యాపారాలకు ప్రోత్సాహం. విందూ వినోదాల్లో పాల్గొంటారు.
గురుబలం అధికంగా ఉండటం వలన వివాహాది శుభకార్యాలు సానుకూల పడుతాయి. ఉన్నత విద్య కొరకు విదేశీ యాన ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. వృత్తి వ్యాపారాలకు ప్రోత్సాహం ఉంటుంది. ఇంటర్వ్యూలకు హాజరవుతారు. అధికారం కలిగిన ఉద్యోగం లభిస్తుంది. నూతన కార్యక్రమాలను ఆరంభిస్తారు. ఎవరినీ అర్థించకుండా మీ పనులు మీరే చేసుకుపోతారు. ఆర్థిక సర్ధుబాట్లను నేర్పుగా చేసుకోగలుగుతారు. సన్నిహితులతో కలిసి విందూ వినోదాల్లో పాల్గొంటారు.
గతంలో మీరు చేసిన కృషికి ఫలితాలు ఈ వారం అందుకుంటారు. ఫిక్స్ డ్ డిపాజిట్ల వల్ల లబ్ధిపొందుతారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారికి, డాక్టర్స్,లాయర్స్, చార్టెడ్ అకౌంటెట్స్ లకు అవకాశాలకు కలిసి వస్తాయి. వీసా, పాస్ పోర్ట్ లు వంటి అవకాశాలు కలుస్తాయి. విదేశాల్లో ని వారికి గ్రీన్ కార్డులు లభిస్తుంది. జీవిత భాగస్వామి తో విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. శక్తి కంకణం ధరించండి.
పరిష్కారములు : రవి, కుజ,శని, రాహు,కేతు గ్రహములకు శాంతులు
మార్చి 2016: విదేశీయాన, ఉద్యోగాలు, ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు.
ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. పనులలో సన్నిహితుల సహయం అందుకుంటారు. శాస్త్ర సాంకేతిక విషయాలపై ఆసక్తి చూపుతారు. వివాహాది శుభకార్యాలు నెరవేరుస్తారు. ఇంటర్వ్యూలకు హాజరవుతారు. ప్రభుత్వ టెండర్లు, కాంట్రాక్టుల కొరకు కృషి తీవ్రం చేస్తారు. రాజకీయ , సినీ కళా రంగాల వారికి విదేశీయాన సూచన. సన్నిహితులతో కలిసి విందూ వినోదాల్లో పాల్గొంటారు. పనిని విభజన చేస్తారు. నూతన ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు.
పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ఉన్నత విద్య కోసం విదేశాలలో దరఖాస్తులు పెట్టుకుంటారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయస్థానాలలో పోరాడుతారు. లీజులు అగ్రిమెంట్లు మొదలైన వాటి గడువు పొడిగిస్తారు. సంతానం పురోభివృద్ది సంతృప్తి కలిగిస్తుంది. నూతన ఉద్యోగాలు లభిస్తాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడుతాయి. ఏక పక్ష నిర్ణయాలు ఫలించవు. నూతన ఒప్పందాల్లో కాస్త నిదానం అవసరం. కార్యాలయాల్లో పని వత్తిడి అధికమవుతుంది. సరస్వతి తిలకాన్ని ధరించండి.
పరిష్కారములు : రవి, కుజ,శని, రాహు,కేతువులకు శాంతులు
ఏప్రిల్ 2016 : నూతన ఉద్యోగ అవకాశాలు అనుకూల పడతాయి. భూములు కొనుగోలు అమ్మకాలు లాభిస్తాయి.
అన్ని రకాల పోటీ పరీక్షలకు అవసరమైన వస్తువులను సమకూర్చుకుంటారు. వ్యాపారాలలో మీరు అనుకున్నంత లాభాలు సూచిస్తున్నాయి. ప్రభుత్వ కాంట్రాక్లు, టెండర్లు చేతికం దుతాయి. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. భూములు కొనుగోలు అమ్మకాలు లాభిస్తాయి.
కొత్త వ్యాపారాలకు మరియు వ్యాపారా వివస్తరణకు ప్రాముఖ్యతనిస్తారు. వివాహయత్నలు ఫలిస్తాయి. నూతన ఉద్యోగ అవకాశాలు అనుకూల పడతాయి. ఇంటి నిర్మాణాలు చేపడతారు. రాజకీయ, కళారంగాల లోని వారికి విదేశీ యానం. అష్టమూలిక గుగ్గిలంతో శుక్ర,శని,మంగళ వారాల్లో ఇంట్లో పొగ వేయడం ఉత్తమం, ఇది దుష్ట శక్తులకు ఉద్వాసన
పరిష్కారములు : రవి, కుజ, శని,రాహు,కేతువులకు శాంతులు
మే 2016 : దూర ప్రాంత ప్రయాణాలు, వివాహాది శుభకార్యక్రమాలు లాభిస్తాయి.
ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. ఎగుమతి, దిగుమతి వ్యాపారాలలో లాభాలు లాభిస్తాయి. శత్రు వర్గాన్ని ఓ కంట కనిపెడుతుంటారు. వ్యక్తిగత అభివృద్ది ఉపకరించే ఏ అంశాన్ని కూడా నిర్లక్ష్యం చేయరు. వివాహాది శుభకార్యక్రమాలు ఈ వారం చోటు చేసుకుంటాయి. సంఘసేవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. దూర ప్రాంత ప్రయాణాలకు గాను తేదీలు ఖరారు చేస్తుంటారు.
జీవిత భాగస్వామి సలహాలతో ఒక నూతన కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఇంటర్వ్యూలు ప్రతికూలత ఎదురయ్యే అవకాశం ఉన్నాయి. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు. సాంకేతిక విద్య యందు ఆసక్తి చూపుతారు. అరటినార వత్తులతో దీపారాధన చేయండి. దీనివలన సంతాన పురోగతి ప్రభుత్వ పరమైన పనులు అనుకూలించుట, పెళ్లి చూపులు సఫళీకృతమవుట మొదలైన లాభాలు చేకూరుతాయి.
పరిష్కారములు : కుజ, బుధ, శని, రాహు, కేతువులకు శాంతులు
జూన్ 2016 : ఉల్లాసంగా గడుపుతారు, శుభకార్యాలు జరుగుతాయి.
గురుబలం బాగా ఉన్నందున వివాహాది ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్యాలు జరుగుతాయి. కుటుంబ పురోగతి బాగుంటుంది. మొండి తనాన్ని పట్టుదలను కలిగి ఉంటారు. దీర్ఘకాలిక సమస్యల నుండి ఊరట చెందుతారు. సంతాన విషయమై సంతృప్తి చెందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలు సాగిస్తారు. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతారు.
బంధువులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. వర్ణాంతర వివాహాలు సూచిస్తున్నాయి. వృత్తి వ్యాపారాలలో సాధారణ ఫలితాలు లభిస్తాయి. మీ ముందు ఒక మాట మీ వెనుక ఒక మాట చెబుతూ వస్తున్న వారి పట్ల అప్రమత్తంగా మెలగవలసిన ఉంటుంది. నరఘోష అధికంగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండండి. వాహనాలు నడిపేటపుడు జాగ్రత్తలు పాటించండి చెప్పదగిన సూచన. తెల్లజిల్లేడు వత్తులతో గణపతిని పూజించండి.
పరిష్కారములు : రవి, కుజ, శని,రాహు,కేతువులకు శాంతులు
జూలై 2016 : హోదాలు పెరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు, పోటీ పరిక్షలలో ఉత్తీర్ణులవుతారు.
సాంకేతిక విద్య ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలల్లో అభివృద్ది సాధిస్తారు. హోదాలు పెరుగుతాయి. ప్రతి చిన్న పనికి శ్రమించి చివరకు పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుండి శుభవార్త అందుకుంటారు. ముద్రణా, ప్రచురణా రంగాలలో వారికి అనుకూలంగా ఉంది. ప్రభుత్వ పరంగా రావలసిన టెండర్లు, కాంట్రాక్టులు లభిస్తాయి. విదేశాలు, విదేశీ వస్తువులు, అమితంగా ఆకర్షిస్తాయి.
నూతన ఉద్యోగ ప్రయత్నాలు కానిస్తారు. పోటీ పరిక్షలలో ఉత్తీర్ణులవుతారు. ప్రతిష్టాత్మక విద్యా సంస్థలలో సీట్లు సంపాదిస్తారు. విదేశాల వారికి గ్రీన్ కార్డు లభిస్తుంది. ప్రత్యర్థి వర్గం వారు ఉద్యోగంలో మీ స్థానమునకు చలనం తెచ్చే ప్రయత్నం చేస్తారు. లక్ష్మీ తామర వత్తులు లక్ష్మీ దేవి ముందర వెలిగించండి.
పరిష్కారములు : రవి, బుధ,కుజ, శని, రాహు, కేతువులకు శాంతులు
ఆగస్టు 2016: నూతన ఉద్యోగాలు, గృహ కొనుగోలు, నూతన పరిశ్రమలు.
వివాహాది శుభకార్యాలలో కొంత జాప్యంతో సానుకూలత పడతాయి. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం లభిస్తుంది. కొత్త వ్యాపార ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. గృహ కొనుగోలు యత్నం ఫలిస్తుంది. నూతన పరిశ్రమలు, సంస్థలను ప్రారంభిస్తారు. విద్యార్థులకు మెడికల్ సీట్లు సాధిస్తారు.
నూతన ఆభరణాలు, వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగస్తులకు బదిలీల సూచన. రాజకీయ రంగంలో ప్రవేశించే వారికి అనుకూలముగా ఉంది. చేపట్టిన పనులను నెరవేరుస్తారు. నూతన ఉద్యోగాలు లభిస్తాయి. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.
స్త్రీలతో వివాదాలు లాభించవని గుర్తించండి. ఆస్తి వివాదాలు పరిష్కర దశకు చేరకుంటాయి. దీర్ఘకాలిక రుణాలు తీరుస్తారు. వర్ణాంతర వివాహాలు జరిగే సూచన. శ్వేతార్థ గణపతి ని నిత్యము ఆరాధించండి, మరిన్ని మంచి ఫలితాలు పొందండి.
పరిష్కారములు : కుజ, బుధ,శుక్ర,శని, రాహు, కేతువులకు శాంతులు
సెప్టెంబర్ 2016 : రాజకీయరంగం ప్రవేశం, విదేశీ పర్యటన, వివాహాది ప్రయత్నాలు ఫలిస్తాయి.
నూతన ఒప్పందాలు కుదురుతాయి. వాహనలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులు లాభాలు రొటేషన్ల రూపంలో ఉంటాయి. నూతన ప్రయత్నాలు సాగిస్తారు. మొండి బాకీలు వసూలవుతాయి. రాజకీయరంగం ప్రవేశం చేయానుకునే మీ ఆలోచనలు బల పడుతాయి. నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కోర్టు కేసులు పరిష్కారం దశకు వస్తాయి. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు.
రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి విదేశీ పర్యటన సూచన. ఉద్యోగస్తులకు బదిలీ సూచన. వివాహాది ప్రయత్నాలు ఫలిస్తాయి. స్త్రీ సంతానం పట్ల విశేషమైన ప్రేమతో, విలువైన బహుమతుల్ని కొనిస్తారు. స్థిరాస్తులలో వాటా ఇవ్వాలని నిర్ణయించుకుంటారు. వీసా, పాస్ పోర్ట్ వంటి అంశాలు లభిస్తాయి.
ఆర్థిక లావాదేవాలు మామూలుగా ఉంటాయి. రుణాలు చేయాల్సి రావచ్చు. లక్ష్మీతామర వత్తులతో మహాలక్ష్మిని పూజచేయండి. ఈ వారంలో అనగా 1-9-2016 న సూర్య గ్రహణం ఉంది కానీ అది మన భారత దేశంలో కనిపించదు. ఈ గ్రహణ దోష నివారణకు శివాలయంలో సర్ప సూక్త సహిత మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం 27 రోజుల లోపు చేయించాలి మరియు శివాలయంలో పూజారికి వస్త్రాలు సమర్పించాలి. శక్తి లేని వారు శక్తి మేరకు పూజారికి దక్షిణ ఇవ్వవలెను.
పరిష్కారములు : రవి, కుజ,గురు,శని, రాహు, కేతువులకు శాంతులు
అక్టోబర్ 2016 : నూతన ఒప్పందాలు, వివాదాలు పరిష్కారమవుతాయి, వారసత్వం పొందుతారు.
పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలకు హాజరవుతారు. భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు చేసుకుంటారు. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు గడిస్తారు. కొత్త వ్యాపారాలలో ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఏర్పడిన వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీల సూచన. వారసత్వం పొందుతారు. స్త్రీలకు నామినేటెడ్ లేదా రాజకీయ పదవి లభించే అవకాశాలు ఉన్నాయి.
రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి అనుకూల ఫలితాలు సూచిస్తున్నాయి. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబంలో మరొకరి సంపాదన ఉండటం ఊరట కలిగిస్తుంది. రాజకీయాలు కొంత బాధిస్తాయి కొంతమంది ఉన్నత స్థాయి వ్యక్తులతో బహిర్గత పోరాటం తప్పదు ప్రింట్ మీడియా , ఎలక్ట్రానిక్ మీడియా వల్ల ఇబ్బందులు రావచ్చు. నాగ సింధూరం ధరించండి.
పరిష్కారములు : రవి, బుధ, గురు, శని,రాహు, కేతువులకు శాంతులు
నవంబర్ 2016 : కళా, రాజకీయ రంగాల వారికి సన్మానాలు, విదేశీయానం.
స్థిరాస్తి విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సాంకేతిక విద్యలపై ఆసక్తి చూపుతారు. వ్యాపారాలలో స్వల్ప మార్పులు ఉండవు. గృహ నిర్మాణ పనులు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తి కరంగా ఉంటుంది. ఓర్పు నేర్పులతో ముఖ్య వ్యవహారాలు సానుకూలపరచుకునే ప్రయత్నాలు చేస్తారు. సాంకేతిక, వైద్య రంగంలో మీ ఆలోచనలు ప్రజాదరణను, ప్రభుత్వ అమోదముద్రను పొందుతారు.
గత స్మృతులు గుర్తు తెచ్చుకుంటారు. మిత్రులతో, బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు. కళా, రాజకీయ రంగాల వారికి సన్మానాలు, విదేశీయానం, విదేశాలలో వారికి గ్రీన్ కార్డు లభిస్తుంది. అష్ట మూలికా తైలంతో దీపారాధన చేయండి.
పరిష్కారములు : కుజ, రాహు, కేతువులకు శాంతులు
డిసెంబర్2016 : వాహనాల కొనుగోలు, అధికారం కలిగిన ఉద్యోగం సంపాదిస్తారు.
సంగీత సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు, రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి అవకాశాలు కలిసి వస్తాయి. గృహం , వాహనాల కొనుగోలు యత్నాలు కలిసి వస్తాయి. ఇన్ కంటాక్స్, సేల్స్ టాక్స్, ఆస్తి పన్ను సకాలంలో చెల్లిస్తారు. అధికారం కలిగిన ఉద్యోగం సంపాదిస్తారు. న్యాయ బద్దమయిన మీ కోరికలకు, ఆశయాలకు దైవానుగ్రహం లభిస్తుంది. లీజులు, ఎగ్రిమెంట్లు మొదలైన వాటి గుడువు పొడిగించే ప్రయత్నాలు చేస్తారు.
కోర్టు కేసుల నుంచి కొంత ఊరట చెందుతారు. బాధ్యతలు అధికమవుతాయి. పనులు ప్రణాళికాబద్దంగా సాగుతున్నా కొంత జాప్యం చోటు చేసుకుంటుంది. ఉద్యోగులకు బదిలీల సూచన. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వల్ల ఇబ్బందులు రావచ్చు. మీ కుటుంబ వ్యవహారాలలో మితిమీరిన జోక్యం కొంత అశాంతికి కారణం అవుతుంది. సానుకూలప డతారు. ఓం నమోఃనారాయణాయ వత్తులు వెలిగించండి.
పరిష్కారములు : కుజ, గురు,శని, రాహు, కేతువులకు శాంతులు