క్షీరసాగర మధనములో ధన్వంతరి జనన మరణాలకి తావులేని దివ్య ఔషధాన్ని దేవతలకిచ్చాడు. పంచమ వేదమైన ఆయుర్వేధాన్ని బ్రహ్మదేవుని కిచ్చాడు. బ్రహ్మ నుంచి దక్షప్రజాపతికీ, వాని నుంచి అశ్వినీ పుత్రులకీ వచ్చింది. ఆ తర్వాత భరద్వాజ ఋషి దేవలోకంలో ఆయుర్వేధాన్ని పఠించి, ఆత్రేయ మహర్షికి ఆ రహస్యాలను బోధించాడు. ఆయన వద్దే అగ్నివేశుడు అభ్యసించి ‘అగ్నివేశ’మను ఆయుర్వేధ గ్రంథాన్ని రచించాడు. అందునుంచి వచ్చినవే ఆయుర్వేద మహామహతి గ్రంథాలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: