"ధన్యము వెరళ నగర్, లేదు ఇటువంటి ధరిత్రిపై ఘృష్ణేశ్వరుడు నివసించుచోటు, అయి ఉండు సర్వోత్తమం. (ధన్యవేరుళ్ నగర్, నహీ ఐసీ ధర్తీ పర్ రెహతే జహా ఘృష్ణేశ్వర్, స్థాన్ సర్వోత్తమ్ కా)  - మధ్య మునీశ్వర్ శంకర భగవానుని జ్యోతిర్లింగాల యాత్రలో ఆఖరిగా, పన్నెండవ జ్యోతిర్లింగం అయిన ఘృష్ణేశ్వరుని దర్శనం కూడా చేస్తేగానీ ఈ యాత్ర సంపూర్ణం కాదు. ఔరంగాబాద్ నుంచి పశ్చిమ దిశలో సుమారు 30కి.మీ. దూరంలో వేరుళ్ గ్రామం దగ్గర శివాలయ్ అనే  తీర్థస్థానంలో ఘృష్ణేశ్వరుని దివ్యజ్యోతిర్లింగం ఉంది. వేరుళ్, శివాలయ్ మరియు ఘృష్ణేశ్వరం గురించి మనం వినే కథలు ఈ విధంగా ఉన్నాయి.


మైదట ఇక్కడ నాగజాతి ఆదివాసులుండేవారు. నాగుల స్థానం 'బాంబీ' అంటే పాముల పుట్టలు. వీటిని మరాఠీలో వారుళ్ అంటారు. అదే కాల క్రమాన వేరుళ్ గా మారింది. ఇక్కడ ఎలగంగానది ప్రవహిస్తుంది. ఈ ఎలగంగా నదీ తీరంలో గల ఊరు 'యేరుళ్' గ్రామంగా పేరుపొందింది. ఈ ప్రదేశంలో మొదట "యెల" అనే పేరుగల రాజుండేవాడు. ఈతని రాజధానియే యేలాపూర్, యేలూర్ లేక వేరుళ్ గా పేరుగాంచింది. ఒకసారి యెలరాజు వనంలో వేటకి వెళ్లాడు. వేటలో మునులుండే ఆశ్రమాలకు చెందిన జంతువులను కూడా  చంపివేశాడు. అది చూసిన మునులు రాజును సర్వాంగాలు పురుగులు పట్టాలని శపించారు. ఈ విధంగా యెలరాజ వనాలవెంట తిరుగనారంభించాడు. దాహంతో గొంతు ఎండిపోసాగింది. ఎక్కడా  నీరేలభించలేదు. చివరికి ఒకచోట ఆవు డెక్కలతో చేయబడి గుండలలో కొద్దిగా నీరు కనిపించింది. ఆ నీరు రాజునోట  పోసుకోగానే, ఒక అద్భుతం జరిగింది. రాజు శరీరానికి పట్టిన పురుగులన్నీ మటుమాయం అయ్యాయి. అప్పుడు రాజు ఆ ప్రదేశంలో తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షం అయ్యాడు. అక్కడ అష్ట తీర్థాలను ప్రతిష్టాపించాడ. దగ్గరలోనే ఒక సువిశాలమూ, పవిత్రమూ అయిన సరోవరాన్ని నెలకొల్పాడు. ఆ బ్రహ్మ సరోవరం పేరే శివాలయ అయ్యింది.


ఈ శివాలయ గురించి కూడా ఒక కథ ఉంది:-
కైలాసంలో శివపార్వతులు చదరంగం ఆడుతున్నారు. ఆటలో పార్వతి గెలిచింది. దాంతో శంకరునికి కోపం వచ్చింది. వెంటనే బయలుదేరి దక్షిణానికి వెళ్లిపోయాడు. సహ్యాద్రి పర్వతాలపై ఒక చల్లని గాలి ప్రదేశంలో నివసింప సాగాడు. ఆ ప్రదేశానికి మహేశమౌళి లేక మైహ్సమాల్ అని పేరు పెట్టారు. శంకరుణ్ణి వెతుక్కుంటూ పార్వతికూడా ఆ ప్రదేశానికి చేరుకుంది. అక్కడికి పార్వతి ఒక భిల్లు స్త్రీ రూపంలో వెళ్ళి శివుని మనసు దోచుకుంది. ఇద్దరూ కొంతకాలం ఆ ప్రదేశంలో రమించారు.
ఆ వనానికి కామ్యకవనం అని పేరు కూడా వచ్చింది. కామ్యక వనంలోని మహేశమౌళి లేదా భైంసామాల్ అనే స్థలంలోకి కాకులు కూడా రాకూడదని శివుడు ఆదేశించాడు. ఒకసారి పార్వతికి దాహం వేసింది. అప్పుడు శంకరుడు భూమిలోనికి త్రిశూలం గుచ్చి పాతాళం నుండి భోగావతి నీటిని పైకి రప్పించాడు. దీనినే శివాలయ తీర్థం అని అంటారు.తరువాత శివాలయ తీర్ధం అభివృద్ధి చేయబడింది. ఈ శివతీర్థంలో శివనది (శివనానది) వచ్చి కలుస్తుంది. శివతీర్థం దాటాక ఎలగంగలో వచ్చి కలుస్తుంది. కామ్యవనంలో శివపార్వతులు క్రీడారతులై ఉండగా సుధన్వుడనే వాడు ఆవనంలోనే వేటకై వచ్చాడు. అద్భుతం జరిగి సుధన్వుడు స్త్రీ రూపధారి అయిపోయాడు. అప్పుడు అతడు శివతీర్థంలో ఘోరతపస్సు చేసి శివుణ్ణి ప్రత్యక్షం చేసుకున్నాడు. నిజానికి సుధన్వ పూర్వ జన్మలో స్త్రీయే. ఆమె పేరు ఇల. శంకరుని శాపవశంగా, సుధన్వ ఎలగంగగా మారింది. ఈ విధంగా పుణ్యసరిత ఎలగంగ యొక్క ఉద్గమం కామ్యవనంలో జరిగింది. తరువాత ఇది ధారా తీర్థం లేదా సీతాదేవి స్నాన గృహంగా ఇంకా ఎత్తునుండి జలధారగా క్రిందికి ప్రవహించి వేరుళ్ గ్రామం వద్ద నుంచి ముందుకు సాగిపోతుంది.


కామ్యవనంలో ఒకసారి కుంకుమ మరియు కేసరి తీసుకుని పాపిటను అలంకరించుకోవడానికై పార్వతి నిలిచి ఉంది. ఆమె ఎడమ చేతిలో కుంకుమ-కేసరిలో శివాలయ నీరు కలిపింది. తరువాత కుడిచేతి వేలితో మిశ్రమాన్ని కలపటం ప్రారంభించింది. అప్పుడొక చమత్కారం జరిగింది. కుంకుమతో శివలింగం తయారయింది. ఆ లింగం నుండి ఒక దివ్యజ్యోతి ఉద్భవించింది. పార్వతి ఈ అద్భుతాన్ని ఆశ్చర్యంతో తిలకింపసాగింది. అప్పుడు శివుడిలా అన్నాడు

"ఈ లింగం పాతాళపు అగాథంలో ఉండేది. ఇది త్రిశూలం నుంచి వచ్చింది.
అప్పుడు భూతలం ఒకసారి ఎగసిపడింది - నీటి ఉడుకులాగా" (కాశీ ఖండం)

పార్వతి ఆ దివ్య జ్యోతిర్లింగాన్ని ఒక రాతి  లింగంలో ఉంచి, విశ్వ కల్యాణార్థం లింగమూర్తిని అక్కడ ప్రతిష్టించింది. ఈ పూర్ణ జ్యోతిర్లింగాన్ని కుంకుమేశ్వరుడని కూడా పిలుస్తారు. దక్షిణ దిశలో గల దేవపర్వతంపై తన పత్ని, పతివ్రతా, సుందరి అయిన సుదేహతో భారద్వాజ నగోత్రుడైన సుధర్ముడనే వేదజ్ఞ బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆమె సంతాన హీనులౌటాన చాలా దుఃఖితురాలై ఉండేది. అస్తమానం ఇరుగు పొరుగుల వ్యంగ్య బాణాలు విని భరించలేకపోతూ ఉండేది. దీన్ని గురించి ఎంత మొర పెట్టుకున్నా తత్వజ్ఞుడైన సుధర్ముని తలకెక్కేదికాదు. చివరికి, ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి, తన భర్తను రెండవ వివాహానికి ఒప్పించింది. తన చెల్లి అయిన ధుశ్మను ఇచ్చి తన భర్తకు పెళ్ళి చేసింది. తాను ఎట్టి ఈర్ష్యా చూపనని ఇద్దరికీ హామీ ఇచ్చింది.


కొంత కాలానికి ధుశ్మ ఒక కోడుకుని కంది. ఆ కొడుకు కొంచెం పెద్దవాడైనాక అతడి వివాహం కూడా జరిగింది. సుధర్మ, ధుశ్మ సుదేహ సఖ్యంగా ఉంటున్నా, వారిలో కొంత ఈర్ష్య కూడా జనించసాగింది. అనతి కాలంలోనే అది ఎంత పరిపక్వం అయ్యిందంటే సుదేహ, నిద్రిస్తున్న ధుశ్మ యొక్క తనయుడిని హత్య చేసి, శవాన్ని చెరువులో పడవేసింది.ప్రొద్దున్నే ఈ విషయం తెలియగానే ఇంటిలో కల్లోలం చెలరేగింది. ధుశ్మకు అంతులేని దుఃఖం కలిగింది. వ్యాకులత చెందుతూ కూడా, ధుశ్మ నిత్యపజ మానకుండా ప్రతిరోజూ చెరువు వద్దకు వెళ్లి వంద శివలింగాలు తయారు చేసి, వాటిని పూజించి వచ్చేది.  వంద లింగాలనూ చెరువులో విసర్జన చేసి వెనక్కు తిరిగేసరికి, తన పుత్రుడు చెరువు వద్ద సజీవుడై నిలబడి ఉండటం చూసింది. శివుడు ప్రసన్నుడై సుదేహ చేసిన పాపాన్ని వివరించాడు. ఆమెను చంపటానికి సన్నద్ధుడైనాడు. అప్పుడు దుశ్మ చేతులు జోడించి, సుదేహ చేసిన పాపాన్ని క్షమించమని వేడుకుంది. ఇదికాక. ధుశ్మ శివుణ్ణి అతి దీనంగా ప్రార్థించి, తన భక్తికి ప్రసన్నుడైతే, శివుడు లోక కల్యాణార్థం సదా అక్కడ వెలయమని వేడుకుంది. ఆమె ప్రార్ధనను స్వీకరించి, అక్కడ దుశమేళ నామధారియై జ్యోతిర్లింగ రూపంలో అక్కడ వెలశాడు. పరమ శివభక్తుడైన భోసలేకు (వేరుళ్ యొక్క గ్రామ పెద్ద) ఘృష్ణేశ్వరుని కృపవలన పాముపట్టలో ఒక పెద్ద నిధి లభించింది. ఆ ధనంతో శిథిలమైన ఆలయాన్ని అతడు పునర్నిర్మాణం చేయించాడు. శిఖరశింగ్ణాపూర్ లో ఒక చెరువు తవ్వించాడు.  తరవాత భోనలే వశంలో సాక్షాత్తూ భోలా నాథుడే జన్మనెత్తి, వారి వంశప్రతిష్ఠను పెంచాడు. 


గౌతమీబాయి (బైజాబాయి) మరియు అహిల్యాదేవి హోల్కర్ తరువాతి కాలంలో ఈ ఆలయాన్ని తిరిగి బాగు చేయించారు. 240 x  185 అడుగుల ఎత్తు, వెడల్పూ గల గుడి నేటికీ దృఢంగా, సుందరంగా నిలిచి ఉంది. మందిరానికి సగం ఎత్తులో, ఎర్రరాతితో ఫలకంపై దశావతార దృశ్యం కడు రమ్యంగా చిత్రీకరింపబడింది. ఇతర దేవీదేవల విగ్రహాలు కూడా ఉన్నాయి. జయరామ్ భాటియా అనే దాత స్వర్ణరేకు తాపడం చేసిన తామ్ర శిఖరం (గోపురం) చేయించాడు. 24రాళ్ల స్థంభాలతో సభామంటపం చేయించాడు. స్తంభాలపై అత్యుత్తమమైన చెక్కడపు పనితం ఉంది. చిత్రాలూ అతి సుందరంగా ఉంటాయి. గర్భగుడి 17 x 17 అడుగులు కలిగి, లింగమూర్తి పూర్వాభి ముఖంగా ఉంది. సభామండపంలో భవ్యమైన నందికేశ్వదేర విగ్రహం ఉంది.


దేవస్థాన నిర్వహణ ఒక నియుక్త సమితి ద్వారా నిర్వహింపబడుతోంది. రోజు అంతా నగారాల వాయిద్యం, వినిపిస్తూ ఉంటుంది. పూజ, హారతి చేస్తారు. గర్భగుడిలో దర్శనంకై వెళ్లేటప్పుడు పై వస్త్రాలు విడిచి వెళ్లాలి. సోమవారం, ప్రదోషకాలం, శివరాత్రి మరియు ఇతర పండుగలూ అయ్యే సమయాలలో ఇక్కడ ఒక పెద్ద మేళా జరుగుతుంది. ఎల్లప్పుడూ జనసందోహం ఉంటుంది. 21గణేశ పీఠాలలో లక్ష వినాయక నామంతో ఇది ప్రసిద్ధి కెక్కింది. అన్నిటి కన్న ముందుగా లక్ష వినాయక దర్శనం చేసుకుంటారు. ఈ ప్రదేశంలో ఎప్పుడూ శివనామం వినబడుతూ ఉంటుంది.
ఓం నమః శివాయ !  ఓం నమః శివాయ !


మరింత సమాచారం తెలుసుకోండి: