మామూలు రోజుల్లో కంటే పర్వదినాల్లో భగవంతుడిని అనుసంధానం చేసుకోవడం ముఖ్యంకాబట్టి ఉపవాసం అనేది ఎక్కువగా పర్వదినాల్లోనే చేస్తుంటారు. ‘ఉప’ అంటే దగ్గరగా, ’వాసం‘ అంటే ’ఉండడం‘ అని అర్థము. అంటే మన మనసును ఆ భగవంతునికి దగ్గరగా ఉంచడం అని అర్థంగా తెలుస్తున్నది.
అంతేకానీ కేవలం ఆహారాన్ని పూర్తిగా తీసుకోకుండాను లేదా ఒకపూట పళ్ళు, ఫలహారాలు తీసుకుని చేసేది ఉపవాసం కాదు. కనుక ఉపవాసం చేయాలా, అవసరమా అని తర్కించుకునే దానికంటే భక్తి శ్రద్ధలతో చేయడం మంచిది.
మరింత సమాచారం తెలుసుకోండి: