గురువు అంటే దరువు కాదు,గురువు అంటే దొరువు కాదు,గురువు అంటే ధరణికి వెలుగు గురువు అంటే దార్శనికతకు కొలువు
గురువు అంటే దరువు కాదు,గురువు అంటే దొరువు కాదు,గురువు అంటే ధరణికి వెలుగు గురువు అంటే దార్శనికతకు కొలువు
గురువు అంటే గుండ్రా‌యి కాదు,గురువు అంటే గునపం కాదు,గురువు అంటే గుడిలో దైవం గురువు అంటే గురుతర బంధం


గురువు అంటే శిల కాదు,గురువు అంటే శిరోభారం కాదు,గురువు అంటే శివమెత్తిన శిల్పం గురువు అంటే శిరోధార్యం,గురువు అంటే వంచన కాదు,గురువు అంటే వంతెన కాదు,గురువు అంటే వందన మందారం గురువు అంటే వాగ్భూషణ భూషణం.

గురువు అంటే అవకాశం కాదు,గురువు అంటే అనర్హం కాదు,గురువు అంటే అక్షరతూణీరం గురువు అంటే అనర్ఘ్యరత్నం,గురువు అంటే నటన కాదు,గురువు అంటే నగబాటు కాదు,గురువు అంటే నవ్వుల నజరానా,గురువు అంటే నవరసాల ఖజానా,గురువు అంటే బెత్తం కాదు గురువు అంటే బెదిరింపు కాదు,గురువు అంటే బెంగాలీ పులి,గురువు అంటే భేరీ నాదం

గురువు అంటే ఉత్తుంగ తరంగం,గురువు అంటే ఉదయించే రవికిరణం,గురువు అంటే ఉరికే జలపాతం,గురువు అంటే ఉరిమే మేఘగర్జన గురువు అంటే మేథోమదనం,గురువు అంటే మేలిమి బంగారం,గురువు అంటే మెరిసే మెరుపు గురువు అంటే మేదినికి మేలుకొలుపు.




మరింత సమాచారం తెలుసుకోండి: