వినాయక చవితి భారతీయ పండుగలలో ఒకటి. పార్వతీపరమేశ్వరుల పుత్రుడైన వినాయకుడి పుట్టిన రోజు. పురాణ గాథలలో శివుడు వినాయకుడిని అందరు దేవతలలోకి మిన్నగా కొలుస్తారు. ఇక భాగ్యనగర ఉత్సవాల్లో ఖైరతాబాద్ వినాయకుడిది ఓ ప్రత్యేక స్థానం. ఈ గణనాథుడి ప్రతిష్టాపన వెనుక ఓ పెద్ద సంకల్పమే ఉంది. ఇక్కడ వందరూపాయాలతో ప్రారంభమైన ఖైరతాబాద్ వినాయకుడి ఉత్సవాలు.. ఇప్పుడు లక్షలు ఖర్చు చేసే స్థాయికి చేరాయి. అంతే కాదు హైదరాబాద్ లోకి ఖైరదాబాద్ వినాయకుడిని విగ్రహాన్ని చూడటానికి ఇక్కడకు విచ్చిన విదేశీయులు సైతం ఎంతో ఆసక్తి కనబరుస్తారు.
ఇక సినీ, రాజకీయ నేపథ్యంలో ఉన్నవారు కూడా హైదరాబాద్ వస్తే..తప్పకుండా ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకొని తీరాల్సిందే. ప్రపంచం చర్చించుకునేలా ఇక్కడ పూజలు జరుగుతున్నాయి. స్వాతంత్ర ఉద్యమకాలంలో బాలగంగాధర్ తిలక్ స్ఫూర్తితో సింగరి శంకరయ్య అనే వ్యక్తి ఈ ఉత్సవాలకు శ్రీకారం చుట్టాడు. ఇప్పుడు గొప్ప సమూహంగా వేడుకలు జరుపుకునే స్థాయి వచ్చింది. ఒక్క అడుగు ఎత్తుతో ప్రారంభమైన ఖైరతాబాద్ గణనాధుడి విగ్రహం ప్రస్తుతం 58 అడుగులకు చేరింది.
గత ఏడాది నుంచి ఒక్కో అడుగు తగ్గిస్తున్నారు. 60 ఏళ్ల చరిత్రలో ఖైరతాబాద్ వినాయకుడు ..ఎన్నో రికార్డులు సృష్టించాడు. మొదట ధూల్ పెట్ నుంచి గణపతి విగ్రహాన్ని తీసుకొచ్చి పూజించేవారు. 16 ఏళ్ల పాటు ధూల్ పెట్ లోని శిల్పి కురుప్ సింగ్ దగ్గర వినాయక విగ్రహాన్ని కొనుగోలు చేసేవారు. ఇక్కడ ఒక కేజీ నుంచి 10 కేజీల బరువుతో లడ్డూని తయారు చేశారు. 17వ ఏట నుంచి లడ్డూని ఏర్పాటు చేయడాన్ని నిలిపివేశారు. 2010 నుంచి లడ్డూ చరిత్ర మళ్లీ ప్రారంభమైంది. 2010లో 500 కేజీల లడ్డూ తయారు చేయించారు. ఆ తర్వాత లడ్డూ బరువు పెంచుతూ పోయారు. గతేడాది 5వేల 600 కేజీల లడ్డూను నివేదించారు.
ఇక ప్రపంచ పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఇకో వినాయకుడి విగ్రహాల ఏర్పాటుకు ప్రాధాన్య ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ..ఖైరతాబాద్ ఉత్సవ సమితి సంచలన నిర్ణయం ప్రకటించింది. సుమారు 80 నుంచి 100 అడుగుల ఎత్తైన మట్టి వినాయకుడిని ఏర్పాటు చేసి.. హుస్సేన్ సాగర్‌లోనే నిమజ్జనం చేస్తామని ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ సమితి అధ్యక్షుడు సుదర్శన్ వివరించారు. మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని గవర్నర్ నరసింహన్‌కు హామీ ఇచ్చామని, శిల్పి రాజేంద్రన్ కూడా ఈ విగ్రహం తయారీకి ఒప్పుకున్నారని తెలిపారు. పీవోపీ విగ్రహాలతో పర్యావరణానికి విఘాతం కలుగుతోందన్నారు.