గణపతి చాలామంది దుష్టరాక్షసులను సంహరించినట్లు గణేశపురాణం ద్వారా తెలుస్తుంది. 1. కశ్యప, అదితి పుత్రుడిగా జన్మించి దేవాంతక, నరాంతకులను వదించెను. మహోత్కట అవతారములో అంభకాసురుని, జంగిభ అనే రాక్షసుని వధించెను.
మయూరేశ్వర అవతారంలో సింధురుడు అనే దైత్యుని, హేరంబుని అవతారంలో వ్యోమకానురుణ్టి, గృహధ్రాసురుణ్టి, వృతురుణ్ణి, కమలాసురుణ్ణి, శతమహిష అను రాక్షసిని సంహరించాడు. గజాననుడి అవతారంలో లోభాసురుణ్ణి లంభోధరుణ్ణి అవతారములో క్రోధాసురుణ్ణి వికటావతారంలో తామాసురుణ్ణి, విఘ్నరాజ అవతారంలో మమతాసురుణ్ణి వధించినట్లు గణేశపురాణంలో చెప్పబడింది. ఇలా ఎందరో రాక్షసులను సంహరించాడు గణేశుడు.
మరింత సమాచారం తెలుసుకోండి: