భారత దేశమంతటా హిందువులు కలర్ ఫుల్ గా జరుపుకునే పండుగల్లో కృష్ణాష్టమి ఒకటి.. ముఖ్యంగా చిన్నపిల్లలను కృష్ణుడు, గోపికల్లా అలంకరించి పెద్దలు మురిసిపోతుంటారు. దేశమంతటా జరిగినా కొన్ని ఆలయాల్లో ఈ పండుక వెరీ స్పెషల్ గా జరుపుతారు. అవెక్కడో చూద్దాం..దేశమంతా కృష్ణ జన్మాష్టమి ఘనంగా జరిగితే... ఆయన జన్మించిన ప్రదేశంలో ఇంకెంత వేడుకగా సాగాలి. మధురలో ఆయన జన్మించిన చోటుగా భావించే ‘శ్రీ కృష్ణ జన్మభూమి’ ఆలయంలో ఈ పండుగ చాలా ఆర్భాటంగా జరుగుతుంది. జన్మాష్టమి సందర్భంలో మధురలోని ఆలయాలు అన్నింటికీ ఒకే రంగుని వేస్తారట. ఈ పండుగనాడు స్వామివారికి 56 నైవేద్యాలు అందించడం మరో విశేషం.


మరో ఆలయం ద్వారక. ఇక్కడ అర్థరాత్రి 11 గంటలకు స్వామివారిని ఉత్సవభోగం పేరుతో ఆడంబరంగా అలంకరిస్తారు. ఆ సమయంలో భక్తులు ఎవ్వరినీ దర్శనానికి అనుమతించరు. ఆ భోగం ముగిసిన తర్వాత అర్ధరాత్రి 12 గంటల నుంచి 2 గంటల వరకు భక్తులకు స్వామివారి దర్శనం లబిస్తుంది. ఇక ఆలయం వెలుపల కూడా భక్తుల దర్శనాదర్థం, బాలకృష్ణుని ఊయలలో ఉంచుతారు.


ఉడిపి లోని శ్రీకృష్ణమఠంలో జన్మాష్టమిని మహావేడుకగా నిర్వహిస్తారు. ద్వైతమత స్థాపకుడైన మధ్వాచార్యులవారు, ఇక్కడి మఠంలోని కృష్ణవిగ్రహాన్ని ప్రతిష్టించారట. జన్మాష్టమి సందర్భంగా ‘విట్టల్ పిండి’ పేరుతో కృష్ణుని మట్టివిగ్రహాన్ని రూపొందించడం ఓ విశేషం. ఆ విగ్రహాన్ని ఊరేగించిన తర్వాత ఆలయంలోని మధ్వసరోవరంలో నిమజ్జనం చేస్తారు.


కృష్ణాష్టమి వచ్చిందంటే మాత్రం... గోవా యావత్తూ రంగులమయం అయిపోతుంది. గోవా రాజధాని పానాజీకి సమీపంలోని మాషెల్‌ అనే పట్నంలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయానికి ఉన్న మరో విశేషం ఏమిటంటే... ఇక్కడ అంతరాలయంలో విగ్రహం దేవకీమాత కృష్ణుని ఎత్తుకున్నట్లుగా ఉంటుంది. ప్రపంచంలోనే ఇలాంటి విగ్రహం ఉండే ఆలయం ఇది ఒక్కటే!

జన్మాష్టమి సందర్భంగా ఈ బృందావనం అంతా రాసలీలల ప్రదర్శనలతో సందడిగా మారిపోతుంది. ముఖ్యంగా బృందావనం సమీపంలోని మధువన్ అనే యమునాతీరంలో కృష్ణుడు రాసలీలలు చేశాడని నమ్మకం. ఇప్పటికీ అక్కడ రాత్రివేళలలో ఆ కన్నయ్య రాసలీలలు చేస్తూ దర్శనమిస్తాడట. జన్మాష్టమి సందర్భంగా ఈ మధువన్‌ అంతా నృత్యసంగీతాలతో హోరెత్తిపోతుంది. వీటితోపాటు గురువాయూరు, నవద్వీప్, పూరీ వంటి అనేక పుణ్యక్షేత్రాలలో జన్మాష్టమి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ ఆలయాల్లో జీవితకాలంలో ఒక్కసారైనా ఆ వేడుకని చూడాలని హిందువులంతా తపించిపోతారు.


మరింత సమాచారం తెలుసుకోండి: