భారతీయుల అతి ముఖ్య పండుగలలో వినాయకచవితి ఒకటి. ఆదిదంపతులు పార్వతీపరమేశ్వరుల పుత్రుడైన వినాయకుని పుట్టినరోజునే మనం వినాయక చవితిగా జరుపుకుంటాం. భాద్రపదమాసం శుక్లచతుర్థి సమయంలో చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి.
గణనాథుడి వేలం పాటలో హైదరాబాద్‌లోని వినాయకునిదే తొలిస్థానం. ప్రతిసారి ఇక్కడ వేలంలో లడ్డూ ధర లక్షలు పలుకుతోంది. గత ఏడాది లడ్డూ ధర రూ.16.60 లక్షలు పలికింది. హైదరాబాద్‌లోని మరికొన్ని ప్రాంతాల్లో రూ.10 లక్షలు దాటింది. ఏపీలో లడ్డూ ధర రూ.5 నుంచి 6 లక్షలు పలుకుతున్నాయి. ఖైరతాబాద్ గణేశుని చేతిలో ఇదు వేల కిలోలలకు పైగా లడ్డూను ఉంచేవారు. ఈ సారి ఎన్ని కేజీలో వేచి చూడాలి.
ఇకపోతే విపాయక మండపాలలో ముంబైదే మొదటి స్థానం ముంబైలో ప్రతి సంవత్సరం 15వేలకు పైగా వినాయక మండపాలను ఏర్పాటు చేస్తున్నారు. అతి పెద్ద నిమజ్ఞనోత్సవం లాల్‌బాగ్సా రాజుదే. దాదాపు 24గంటలపాటు ఈ శోభయాత్ర కొనసాగుతుంది. పుణేలో అత్యధికంగా ప్రతి సంవత్సరం 7లక్షల వినాయక విగ్రహాలను తయారు చేస్తారు. వందలాది మంది కళాకారులు ఈ విగ్రహాల తయారీలో పాల్గొంటారు.ఇక్కడి నుంచి బ్రిటన్, అమెరికాలకు కూడా విగ్రహాలను ఎగుమతి చేస్తారు.
కైలాసంలో పార్వతీ దేవి.. శివుని రాక ఎదురుచూస్తూ నలుగుపెట్టుకుంటుంది. ఆ సమయంలో కిందరాలిన నలుగుపిండితో ఒక బాలుని రూపాన్ని తయారుచేసి.. ఆ రూపానికి ప్రాణం పోస్తుంది. అనంతరం ద్వారం వద్దే కాపలాగా ఉంచి ఎవరినీ రానివ్వొద్దంటూ చెబుతుంది. అదే సమయంలో అటుగా వచ్చిన శివుడినే అడ్డుకుంటాడు ఆ బాలుడు. దీంతో కోపోద్రిక్తుడైన మహాశివుడు బాలుడిని శిరచ్ఛదముగావించి లోపలికి వెళ్తాడు. విషయం తెలుసుకున్న పార్వతీ శివుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దీంతో.. గజాసురిని శిరస్సుని అతికించి తిరిగి ఆ బాలుడిని బ్రతికించాడు శివుడు. గజముఖాన్ని పొందాడు కాబట్టి.. అతను గజాననుడిగా పేరు పొందాడు. కొన్నాళ్లకు పార్వతీ పరమేశ్వరులకు కుమార స్వామి పుట్టాడు.