హిందువులు అత్యంత ప్రీతిపాత్రంగా ఎంతో వైభవంగా నిర్వహించే పండుగలలో ఈ "దసరావైభవం" ఒకటి. దసరాకు మరోపేరు 'దశహరా" అంటే! పది పాపాలను హరించేది అని అర్థం;
రాముడు రావణాసురుని పదితలలు నరకి సంహరించిన సందర్భంగా జరుపుకునే విజయోత్సవంగా కూడా దీనిని వ్యవహరిస్తూ ఉంటారు. సరిగ్గా రావణాసురుని
ఆశ్వీయుజమాసం నవమి తిధినాడు వధించాడు. అలాగే శరదృతువులో కురిసిన వానలవల్ల, చీమలు, దోమలు, కీటకాలు పెరుగుతాయి. ఈ ఋతువులో ప్రజలు రోగబాధలతో మరింతగా బాధపడుతూ ఉంటారు. వీటికి "యమదంష్ట్రము"లని పేరు. ఆరోగ్య ప్రాప్తికి ఈ రెండు ఋతువులలోను నవరాత్ర్యుత్సవం జరుపవలెనని శాస్త్రము.
పూర్వం మధుకైటభులనే రాక్షసులను వధించడానికి బ్రహ్మదేవుని కోరికపై విష్ణువును నిద్రలేపింది మహామాయ. యోగనిద్ర నుంచి మేల్కొన్న విష్ణువు, మధుకైటభు లతో పదివేల సంవత్సరాలు పోరాడినా వారిని జయించలేక పోతాడు. ఇది గమనించిన మహామాయ ఆ మధుకైటభులను మోహపూరితుల్ని చేయగా.... వారు అంతకాలంగా తమతో పోరాడినందుకు
శ్రీ మహావిష్ణువును మెచ్చుకుని నీకు ఏ వరంకావాలి అని ప్రశ్నించగా.... వారి మరణాన్ని వరంగా ఇవ్వమని కోరుతాడు. దాంతో తమకు ఇక మరణము తప్పదని నిర్ణయించుకుని నీరులేనిచోట తమని చంపమనికోరతారు.
శ్రీహరి వారిని పైకెత్తి భూఅంతరాళంలో సంహరించు సమయాన; మహామాయ పదితలలతో, పదికాళ్ళతో, నల్లనిరూపంతో "మహకాళి" గా ఆవిర్భవించి శ్రీమహావిష్ణువునకు సహాయపడుతుంది.
అనంతరం 'సింహవాహినిగా మహిషాసురుని మహామాయ మహాసరస్వతి రూపిణిగా శుంభ, నిశుంభులను వధించింది. చండ, ముండలను సంహరించి చాముండి అని పేరు తెచ్చుకుంది.
కంస సంహారమునకు సహాయపడుటకై "నంద" అను పేరుతో నందుని ఇంట ఆవిర్భవించి శ్రీకృష్ణునికి సహాయపడింది. తరువాత ఐదవ అవతారంలో ఒక రాక్షసంహారసమయాల్లో ఆమె దంతాలు రక్తసిక్తమవడంవల్ల "రక్తదంతి" అయినది. లోకాలు అన్ని కరువు కాటకములతో ప్రజలు పడుతున్న బాధలను చూడలేక "శాకంబరి"గా వార్కి శాకాలు, ఫలాలను ఇచ్చి ఆ తల్లి బిడ్డలను అక్కున చేర్చుకుంది. దురుడను అను రాక్షసుని సంహరించి 'దుర్గ"అను పేరుగాంచింది. "మాతంగి" గా రూపుదాల్చి అంటరానితనాన్ని తొమ్మిదవ అవతారంలో అరుణుడు అను రాక్షసుని తుమ్మెదల సాయంతో హతమార్చి "బ్రామరి" అను పేరు తెచ్చుకుంది.
అందువల్ల ఈ దేవిని "నవవిధ రూపాలతో" అర్చించాలి అని చెప్పబడినది.
శ్రవణానక్షత్రయుక్త దశమి తిథిన విజయదశమితో ఈ దసరావైభవాలు పూర్తిచేస్తారు.
ఆ విధంగా: క్రూరులైన రాక్షసులను సంహరించి ఇటు యోగులకు అటుదేవతలకు ఆనందాన్ని అందించింది సందర్భములో ఈ దేవి నవదుర్గలుగా అవతరించింది అనగా
1. శైలపుత్రీ 2. బ్రహ్మచారిణీ 3. చండ (ఛన్న) ఘంటా 4. కూష్మాండా 5. స్కందమాత 6. కాత్యాయని 7. కాళరాత్రి 8. మహాగౌరీ 9. సిద్ధిదాత్రి అనుపేర్లతో ఆవిర్భవించినది.