హిందువుల అతి ముఖ్యమైన పండుగలలో దసరా పండుగ ఒకటి. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కాబట్టి ఈ పండుగను శరన్నవరాత్రి అని అంతారు. పదవ రోజుతో కలిపి విజయదశమి అని అంటారు. ఈ పండుగ రోజు మనసా వాచా కర్మణా అమ్మవారిని పూజిస్తే మనం అనుకున్న పనులు అన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. విజయదశమి రోజున సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేవాలి. 
 
ఉదయం 5 గంటల లోపు నిద్ర లేచి తల స్నానం చేయాలి. ఇంటిని మరియు పూజా మందిరాన్ని శుభ్రం చేయాలి. గుమ్మాలకు, తలుపులకు పసుపు, కుంకుమ పూయాలి. మామిడి ఆకులతో గుమ్మానికి తోరణాలను కట్టాలి. పూజా మందిరాన్నీ పూలు, పళ్లతో అలంకరించాలి. వీలైతే ఎర్రటి పట్టు వస్త్రాలను ధరించి దుర్గాదేవి ప్రతిమ  లేదా రాజ రాజేశ్వరి చిత్ర పటం సిద్ధం చేసుకోవాలి. 
 
ఎర్రటి అక్షింతలు, పూలు, నైవేద్యం సిద్ధం చేసుకోవాలి. దీపారాధనకు నువ్వుల నూనెను వాడాలి. పూజ చేసే సమయంలో తామర మాల ధరించి ఆగ్నేయం వైపు కూర్చుంటే మంచిది. పూజ పూర్తి చేసిన తరువాత దగ్గరలోని ఆలయానికి వెళితే మంచి ఫలితాలు కలుగుతాయి.  శ్రీశైలం, అలంపూర్, పిఠాపురం ప్రాంతాల శక్తి పీఠాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: