దసరా శరన్నవ రాత్రుల్లో ఆది శక్తి స్వరూపిణి రోజుకో రూపంలో దర్శనమిస్తుంది... నవరాత్రుల చివరి రోజు.. అమ్మ రాజరాజేశ్వరిగా భక్తులను కరుణిస్తుంది. మరి ఈ రాజరాజేశ్వరి రూపం విశిష్టత ఏంటి.. దాని ప్రత్యేకత ఏంటి తెలుసుకుందాం..


రాజరాజేశ్వరి శాశ్వతమైన ఆనందానికి, విజయానికి ప్రతీక. చేపట్టిన ప్రతి పనిలో విజయాన్ని సాధించే నేర్పుకలిగి ఉండటం, ఉన్నతమైన భావనల్ని వ్యాప్తిచేయడం రాజరాజేశ్వరి అవతారం నుంచి మహిశలు అందుకోవాల్సిన స్ఫూర్తి. కొద్దిపాటి విజయంతోనేప్రయత్నాన్ని ఆపకుండా నిరంతర ఉద్యమంగా జీవితాన్ని సాగించాలనే స్పూర్తిని ఈ దేవి అందిస్తుంది.


రాజరాజేశ్వరి త్రిమూర్తుల కన్నా ఉన్నతమైన స్థానం కలిగి ఉంటుంది. ప్రపంచంలో అన్నిటికన్నా ఉన్నతమైన స్థానంమహిళకే ఉందనటానికి ఇది నిదర్శనం. పరిపూర్ణతకు ఈ అమ్మ అసలైన చిహ్నం. రాజరాజేశ్వరీదేవికి అపరాజితాదేవి అని మరో పేరు.


రాజరాజేశ్వరి అన్ని లోకాలకు ఈమె ఆరాధ్య దేవత. దేవతలందరి సమష్ఠి స్వరూపంగా జ్యోతి స్వరూపంతో ప్రకాశిస్తూ పరమేశ్వరుడి అంకాన్ని ఆసనంగా చేసుకుంటుంది. రాజరాజేశ్వరి శ్రీచక్రాన్ని అధిష్ఠించి, యోగమూర్తిగా దర్శనమిస్తుంది. రాజరాజేశ్వరిని పూజించటం ద్వారా మనోచైతన్యం ఉద్దీపితమవుతుంది. రాజరాజేశ్వరి సమున్నతమైన దైవికశక్తికి ప్రతీక.


మరింత సమాచారం తెలుసుకోండి: