దుర్గాదేవి తొమ్మిది రాత్రులపాటు రాక్షసులను వెంటాడి, సంహరించింది. చివరికి పదో రోజున రాక్షసులపై విజయం సాధించింది. దానికి గుర్తుగా దసరా, విజయదశమిని జరుపుకుంటున్నాం. మనలోని దుర్గుణాలే రాక్షసులు, మన లోని దైవాంశే ఆ మహాశక్తి. ఆ శక్తిని గుర్తించి, ఆరాధించి తద్వారా మనలోని దుర్గుణాలను తొలగించమని వేడుకోవడమే దుర్గా నవరాత్రుల పూజలోని అంతరార్థం.

లోకపాలకులైన అష్ట దిక్పాలకులను పాలి౦చేవారు త్రిమూర్తులు. ఆ త్రిమూర్తులను పాలి౦చే దేవత రాజరాజేశ్వరి. రాజు అనగా ప్రకాశిస్తూ ఆన౦ది౦పజేయువాడు అని అర్ధం. లోకాలన్నిటికీ వెలుగునిచ్చే సూర్యునికి కూడా వెలుగునిచ్చే స్వయ౦ ప్రకాశ స్వరూపిణి అమ్మ. ఆన౦దానికి మూలమైన సర్వలోక పాలకురాలు ఈమె.

ఆశ్వయుజ శుక్లపక్ష పాడ్యమి మొదలు నవమి వరకు తొమ్మిది రాత్రులు ఆదిశక్తి సమగ్ర సుందర స్వరూపం. శక్తి, ఆనందం, చైతన్యం మూర్తిభవించిన పార్వతీ మాతను విద్య, ఆరోగ్యం, ఆయుష్షు, విజయం, శుభ ఫలితాలను ప్రసాదించమని ప్రార్థించే రాత్రులే నవరాత్రులు. తొమ్మిది రోజుల నవరాత్రి పూజతో పునీతుడై జీవుడు దశమి తిథి పూజతో విద్యాశక్తి అనుగ్రహాన్ని పొందుతాడని పురాణాలు వచిస్తున్నాయి. అదే విజయదశమి పూజ. విజయాలకు కారకమైన దశమి విజయదశమి. విజయుడు (అర్జునుడు) విరాటరాజు కొలువులో ఉండి కౌరవ సేనలను ఓడించి అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసిన రోజు కాబట్టి విజయ దశమి అయ్యింది.

పది అంటే దశ రాత్రుల పండుగ .. అదే దశరా... దసరా అయ్యింది. పది తలల రావణాసురుడిపై రాముడు విజయం సాధించిన రోజని అందుకే దస్ హరా.. అని కొందరు అంటారు. ఏదేమైనా చెడుపై మంచి విజయం సాధించిన రోజు. ఈ కోట్స్‌తో మిత్రులకు, బంధువులకు శుభాకాంక్షలు తెలియజేయండి.

అసత్యంపై సత్యం సాధించిన విజయం..
అధర్మంపై ధర్మ సాధించిన విజయం...
అధైర్యంపై ధైర్యం సాధించిన విజయం..
అందుకే మనకు ఇది ముఖ్యమైన రోజు...

దుర్గాదేవి తొమ్మిది రాత్రులపాటు రాక్షసులను వెంటాడి, సంహరించింది. చివరికి పదో రోజున రాక్షసులపై విజయం సాధించింది. దానికి గుర్తుగా దసరా, విజయదశమిని జరుపుకుంటున్నాం. మనలోని దుర్గుణాలే రాక్షసులు, మన లోని దైవాంశే ఆ మహాశక్తి. ఆ శక్తిని గుర్తించి, ఆరాధించి తద్వారా మనలోని దుర్గుణాలను తొలగించమని వేడుకోవడమే దుర్గా నవరాత్రుల పూజలోని అంతరార్థం.

మరింత సమాచారం తెలుసుకోండి: