ఓం నమో వేంకటేశాయ!!
• ఈ రోజు మంగళవారం, 22.10.2019 ఉదయం 5 గంటల సమయానికి, తిరుమల: 19C°-23℃°.
• నిన్న 66,025 మంది భక్తులకు కలియుగ దైవం
శ్రీ వేంకటేశ్వరస్వామి వారి
దర్శన భాగ్యం కల్గినది.
• స్వామివారి సర్వదర్శనం కోసం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 02 గదిలో భక్తులు వేచి ఉన్నారు.
• ఈ సమయం శ్రీవారి సర్వదర్శనాని కి సుమారు 06 గంటలు పట్టవచ్చును'
• నిన్న 23,908 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
• నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు. ₹: 4.42 కోట్లు.
• శీఘ్రసర్వదర్శనం(SSD), ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్ ₹:300/-), దివ్యదర్శనం (కాలినడక) వారికి శ్రీవారి దర్శనానికి సుమారుగా రెండు గంటల సమయం పట్టవచ్చును.
గమనిక:
# ₹:10,000/- విరాళం ఇచ్చు శ్రీవారి భక్తునికి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక విఐపి బ్రేక్
దర్శన భాగ్యం కల్పించిన టిటిడి.
# ఈనెల 30 న చంటిపిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం (ఉ: 9 నుండి మ:1.30 వరకు సుపథం మార్గం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు.
# ఈనెల 29న వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక ఉచిత దర్శనం,(భక్తులు రద్దీ సమయాల్లో ఇబ్బంది పడకుండా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోగలరు)
వయోవృద్దులు / దివ్యాంగుల ఎస్వీ మ్యూజియం ఎదురుగా గల కౌంటర్ వద్ద వృద్దులు (65 సం!!) మరియు దివ్యాంగులకు ప్రతిరోజు 1400 టోకెన్లు జారీ చేస్తున్నారు. ఉ: 7 గంటలకి చేరుకోవాలి, ఉ: 10 కి మరియు మ: 2 గంటలకి దర్శనానికి అనుమతిస్తారు.
చంటి పిల్లల తల్లిదండ్రులు / ఎన్నారై ప్రత్యేక దర్శనాలు:
• సుపథం మార్గం గుండా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు, ఉ:11 నుండి సా: 5 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు.