హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో నవంబర్ 3 నుంచి 18వ తేదీ వరకూ జరనున్నది. ప్రతి రోజూ సాయంత్రం ఐదున్నర గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది.నవంబర్ 3 నుంచి అంగరంగ వైభవంగా ఎన్టీవీ-కోటి దీపోత్సవంఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి,కార్తీక మాసం సందర్భంగా భక్తి టీవీ ఆధ్వర్యంలో ఏటా నిర్వహించే కోటి దీపోత్సవం కార్యక్రమం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో నవంబర్ 3 నుంచి 18వ తేదీ వరకూ జరనున్నది. ప్రతి రోజూ సాయంత్రం ఐదున్నర గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది.
ప్రారంభోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ స్టేడియం ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనుంది. కోటి దీపోత్సవంలో భాగంగా ప్రతిరోజు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు, పీఠాధిపతుల అనుగ్రహ భాషణం, స్వామివారి కల్యాణం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగనున్నాయి. ప్రత్యేక పూజలు, వ్రతాలు, ప్రవచనామృతాలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ కార్తీకమాసం ప్రాశస్త్యాన్ని, ప్రాముఖ్యతను, మాసంలో చేయాల్సిన పూజాధికాల గుర్తించి పీఠాధిపతులు, సద్గురువులు, ఆధ్యాత్మిక వేత్తలు వివరిస్తారు.
ఈ కార్యక్రమానికి నగరం నలుమూలల నుంచి భక్తులు పెద్దఎత్తున హాజరుకానున్నారు. అలాగే ఈ ఉత్సవానికి బాబా రామ్ దేవ్, గణపతి సచ్చిదానంద స్వామి, శ్రీశ్రీ రవిశంకర్ వంటి ఆధ్యాత్మిక ప్రముఖులు హాజరవనున్నారు.