అతిపెద్ద హిందూ దేవాలయం అంగ్ కోర్ వాట్ 500 ఎకరాల విస్తీర్ణం.. 65 మీటర్ల ఎత్తయిన భారీ శిఖరం.. చుట్టూ మరిన్ని శిఖరాలతో కూడిన ఆలయ సముదాయం ఉంటుంది.. అద్భుతమైన శిల్పకళ.. పచ్చని కళతో,
నీటి గలగలలు.. ఇవన్నీ ప్రపంచంలోనే అత్యంత పెద్ద దేవాలయమైన అంగ్ కోర్ వాట్ ప్రత్యేకతలు. చాల వింతలకు, అద్భుతమైన విశేషాలకు నిలయమైన ఈ అంగ్ కోర్ వాట్ దేవాలయం గురించి తెలుసుకుందామా మరి...
ప్రస్తుతం కాంబోడియాలో ఉన్న అంగ్ కోర్ వాట్ ఆలయం.. క్రీస్తుశకం వెయ్యో శతాబ్దానికి చెందిన ప్రఖ్యాత ఖ్మేర్ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. ఆ సామ్రాజ్యం
రాజధాని నగరం పేరు కూడా అంగ్ కోర్. మొదట ఈ సామ్రాజ్యాన్ని ఇతరులు పాలించినా.. అనంతరం హిందూ రాజుల పరిపాలనలోకి కొనసాగింది. దీనిని కాంభోజ రాజ్యంగా పిలిచేవారు. యురోపియన్ల వలసల అనంతరం కాంబోడియాగా పిలవడం మొదలు పెట్టారు. అంగ్ కోర్ వాట్ ఆలయాన్ని నిర్మించిన రాజు పేరు సూర్యవర్మన్-2. ఆయన విష్ణుమూర్తి ఆరాధకుడు అని పురాణాలు చెప్పుతు ఉన్నాయి.
ఇది ప్రపంచంలోనే అతి పెద్ద నగరంగా కూడా పిలుస్తారు. అప్పట్లోనే అంగ్ కోర్ నగరంలో ఇక్కడ పది లక్షల మంది వరకు నివసించినట్టు
చరిత్ర పరిశోధకులు అంచనా వేయడం జరిగింది. దీని ప్రకారం 19వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం వచ్చే నాటికి కూడా ప్రపంచంలో అతిపెద్ద నగరం అంగ్ కోర్ అని అర్థం అవుతుంది. ముఖ్యంగా కేవలం నగర ప్రధాన ప్రాంతంలోనే ఏకంగా 5 లక్షల మంది నివసించినట్టుగా తెలియచేశారు.
అంగ్ కోర్ వాట్ కు సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ‘మహేంద్ర పర్వత’గా పిలిచే మరో పెద్ద నగరం అవశేషాలను కూడా గుర్తించడం జరిగింది. ఆలయం ప్రహరీ గోడ లోపలే పలు
నీటి మడుగులు కూడా ఉండటం కూడా చాల విశిష్టం.