
భగవంతుడే ఆశ్చర్య పోయే భక్తులు...పలు రకాల భంగులు
1 *భంగు భక్తులు*
వీరు భంగు,గంజాయి మొదలైన మత్తు తీసుకొని దేవుడి కోసం వెతుకుతుంటారు. దేవుడిని చూడాలనిపించినప్పుడు ఒక దమ్ము లాగి పైకి చూస్తారు.
*2.రంగు భక్తులు*
వీరు తమ భక్తిని రంగు రూపంలో ప్రదర్శిస్తారు. డ్రెస్ కోడ్ కి ప్రాధాన్యత ఇస్తారు. ఈ రకమైన భక్తులు మాలలు వేసుకుంటారు.
*3.హంగు భక్తులు*
వీరికి తమ భక్తిని రిచ్చిగా చూపించాలనే పిచ్చి ఎక్కువగా ఉంటుంది. వీళ్లు బాగా వైభవంగా ఉండే ఆలయాలని మాత్రమే ఇష్టపడతారు.
*4.మింగు భక్తులు*
ఈ టైప్ భక్తులు తమ తిండిపిచ్చినే భక్తి అనే భ్రమలో బతికేస్తుంటారు. గుడి గురించి వీళ్లని అడిగితే వీరు అక్కడ దొరికే "ప్రసాదం" గురించి చెప్పేటప్పుడు వాళ్ల కళ్లల్లో ఒక మెరుపు కనపడుతుంది.
*5.పొంగు భక్తులు*
ఈ టైప్ భక్తులు ప్రతిదానికి పొంగిపోతూ ఉంటారు. టెంకాయలో పువ్వొచ్చినా, దండంపెట్టేటప్పుడు గంట మోగినా చాలు పొంగిపోతుంటారు.
*6.లొంగు భక్తులు*
వీరికి జీవితంలో చాలా కష్టాలు ఉంటాయి. అందుకని వీరు భక్తి లో పీక్స్ కి వెళ్లిపోతారు. మతం పేరుతో జరిగే కొన్ని దురాచారాలకి వీరు కొంత కారణం.
*7.ఒంగు భక్తులు*
వీరు కూడా లొంగుభక్తుల లాంటి వాళ్లే. అంతకుమించి వీరు ఎక్కువగా దొంగబాబాలని నమ్ముతారు. ఎక్కువ మతదురాచారాలకి వీళ్లే ఎక్కువ కారణం.
*8.సాంగు భక్తులు*
వీళ్లకి భక్తి పాటల పిచ్చి. కీర్తనలు,స్తోత్రాలు.
*9.పింగ్ పాంగు భక్తులు*
వీళ్లని చూస్తే ఎవరూ భక్తులనుకోరు. బాగా స్టైలిష్ గా టాటూలతో ఉంటారు. అల్ట్రామోడర్న్ భక్తులు. భక్తిలో టెక్నాలజీ వాడుతారు.
*10.కొంగు భక్తులు*
దరిద్రపు భక్తులు వీళ్లు, కేవలం అమ్మాయిలని చూడటానికి మాత్రమే గుడికి వెళతారు.
*11.రాంగు భక్తులు*
వీళ్లకి ఏ దేవుడిని ఎలా పూజించాలో తెలీదు. అందుకని తెలిసిన ప్రతిదాన్ని తమకిష్టమైన పద్ధతిలో మొక్కుతారు.
*12.కింగు భక్తులు*
వీరికి రాజుల్లాగా మందిరాలు నిర్మించడం అంటే ఇష్టం. వీరిలో మందిరాలు కట్టలేని వారు విరాళాలు ఇచ్చి తమ ఆనందం తీర్చుకుంటారు. ప్రసాదాలని వేలం వేసినప్పుడు ఎక్కువ ఖర్చు చేసి కొంటారు.
*13.వాకింగు భక్తులు*
పుణ్యక్షేత్రాలకి మైళ్లకి మైళ్లు నడిచి వెళ్లే బ్యాచ్. పాద యాత్రలు చేస్తే ఎక్కువ పుణ్యం వస్తుందని వీళ్ల నమ్మకం.
*14.జాగింగు భక్తులు*
ప్రదక్షిణల పిచ్చి ఎక్కువ. 100+ ప్రదక్షిణలు చేసే భక్తులు ఈ కేటగిరి కిందకి వస్తారు.
*15.ట్రెక్కింగు భక్తులు*
భక్తిలో పీక్స్ చూడాలంటే కొండలెక్కాలని నమ్మే భక్తులు.
*16.సఫరింగు భక్తులు*
వీళ్లు దేవుని ముందు ఏడ్చి భక్తిని ప్రదర్శిస్తారు.
*17.కటింగు భక్తులు*
వీరికి శాస్త్రసంబంధ విషయాల్లో బాగా గ్రిప్ ఉందని తామే గొప్ప భక్తులమని అందరికీ తెలిసేలా ప్రదర్శనలు చేస్తుంటారు.
*18.మీటింగు భక్తులు*
వీరికి సమారాధనలు,
ప్రవచన ప్రసంగాలు అంటే చాలా ఇష్టం. చెవులు కోసేసుకుంటారు.
*19.కేర్ టేకింగు భక్తులు*
మిగతా భక్తుల కన్నా రెండాకులు ఎక్కువే చదివిన బ్యాచ్. వీరు ప్రవచనకర్తలుగా, మతగురువులుగా ఉండి తమ ప్రసంగాలతో మతాన్ని, దేవుళ్లని బతికిస్తూ ఉంటారు.
*20.షాకింగు భక్తులు*
వీరు తమ భక్తిని విచిత్రంగా చాటుకుంటూ ఉంటారు. నాలుక కోసుకోవడం, నిప్పుల మీద నడవడం లాంటివి చేస్తుంటారు.
*21.బెగ్గింగు భక్తులు*
వీళ్లు చాలా మంది ఉన్నారు. దేవుడిని అడుక్కుంటూ ఉంటారు అదివ్వు, ఇదివ్వు అని. దేవుళ్లకి లంచం ఇచ్చి పనులు జరగాలని కోరుకునే బ్యాచ్. ముడుపులు,బలులు ఇస్తారు.
*22.షిఫ్టింగు భక్తులు*
వీళ్లు మతం మారిన భక్తులు. వీళ్లు మనశ్శాంతి, లేదా డబ్బు, లేదా అమాయకత్వం, లేదా అజ్ఞానం, లేదా ఇతర కారణాల వల్ల వేరే దేవుడికి షిఫ్ట్ అవుతారు.
*23.కేటరింగు భక్తులు*
వీళ్లు ప్రసాదాలు పంచి తమ భక్తిని చాటుకుంటారు.
వీరి భక్తి కొంత మంది కడుపు నింపుతుంది.
*24.రీజనింగు భక్తులు*
వీళ్లు దేవుడున్నాడని నిరూపించడం కోసం లాజిక్కులు చేసి ఇబ్బంది పెడుతూ ఉంటారు. 'గాలి చూపించు ?కాబట్టి దేవుడున్నాడు' ఇలా ఉంటాయి వీళ్ల లాజిక్కులు.
మీరే టైపు భక్తులు మీరే ఆలోచించుకోండి...పాపం ఇంతమందినీ భగవంతుడు సహించి భరించి కరుణించాలి గదా...!..