తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎంత ప్రతిష్ఠతో ఉందో తెలిసిన విషయమే. కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు అవుతూ ఉంటారు. కోరిన కోరికలు తీర్చే బంగారు దేవుడిగా శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానంలో విరాజిల్లుతూ ఉంటాడు. ఇక ఆలయం మొత్తం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా అనే నామస్మరణతో మారుమోగుతూ ఉంటుంది. అయితే కాలంతో సంబంధం లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎప్పుడు భక్తుల రద్దీ ఉంటుంది. ఎప్పుడు చూసినా భక్తజనంతో జనసంద్రం కనిపిస్తూ ఉంటుంది తిరుమల తిరుపతి దేవస్థానములో . ధనిక పేద అనే తేడా లేకుండా స్వామి వారి చెంతకు చేర్చుకుని భక్తి పారవశ్యంతో మునిగిపోతూ వుంటారు.
ఇకపోతే ప్రస్తుతం తిరుమలలో చలి తీవ్రత మరింతగా పెరిగిపోయింది. తెలుగు రాష్ట్రల్లో చలి తీవ్రత రోజురోజుకు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఎముకలు కొరికే చలితో తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలలో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. పొద్దున్న సమయంలో కాలు బయట పెట్టాలంటే జంకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో చలి తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతోంది. ఇక తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మామూలు కంటే చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే పెరిగిన చలి తీవ్రత తిరుమలకు వచ్చే భక్తుల పై పడింది.
దీంతో తిరుమలకు భక్తుల రాక కాస్త మందగించింది. భక్తుల రాక తగ్గడంతో సప్తగిరులు వెలవెలబోతున్నాయి. కేవలం సాధారణ రద్దీ మాత్రమే సప్తగిరి ల లో కనిపిస్తోంది. అయితే మామూలుగానే ఏడుకొండలలో చల్లగా ఉంటుందన్న విషయం తెలిసిందే... ఇక ఇప్పుడు చలి తీవ్రత ఏకంగా భారీగా పెరిగిపోవడంతో.. ఇప్పుడు మరింత చల్లగా మారిపోయింది ఏడుకొండల్లో వాతావరణం. తీవ్ర మంచు ప్రభావం ఏడుకొండలలో కనిపిస్తుంది. దీంతో భక్తుల సంఖ్య తగ్గిపోయింది. సోమవారం ఉదయం కేవలం 7 కంపార్ట్మెంట్లలో మాత్రమే భక్తులు స్వామివారి దర్శనార్థం ఎదురుచూస్తుండగా వీరికి దర్శనానికి 5 గంటల వరకు సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. ప్రత్యేక దివ్యదర్శనం భక్తుల దర్శనానికి రెండు గంటల సమయం పడుతుందని తెలిపారు. ఇకపోతే కొత్త సంవత్సరం సందర్భంగా రేపు ఆలయంలో కోయల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది. ఈ సందర్భంగా అష్టదళ పాదపద్మారాధన సేవను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు.