శబరిమల యాత్రకు వెళ్లినప్పడు కొండ ఎక్కేసమయంలో స్వాములు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిఉంటుంది. రైలు, విమాన, రోడ్డు మార్గాల ద్వారా కేరళలోని శబరిమల చేరుకునే స్వాములు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. పంబ నుంచి సన్నిధానం వరకు ఏటవాలుగా ఉన్న కొండ ఎక్కే సమయంలో నిదానం పాటించాలి.
కొండ ఎక్కేటప్పడు ప్రతి పది నిమిషాలకు ఒకసారి తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాలి. గుండె సంబంధిత సమస్యలున్నవారు, శ్వాసకోశ వ్యాధులు, ఆస్తమా బాధితులు తప్పనిసరిగా ఆగుతూ వెళ్లాలి. కొండ ఎక్కే సమయంలో కొందరికి ఆక్సిజన్ అందక ఇబ్బంది పడుతుంటారు.
వీరు దారిలో అక్కడక్కడా ఉండే ఆక్సిజన్ పార్లర్లు, కార్డియాక్ సెంటర్లను సంప్రదించవచ్చు. రద్దీ రోజుల్లో సన్నిధానంలో బస ఏర్పాట్లు చేసుకోకపోవడమే ఉత్తమం. స్వామి దర్శనం తర్వాత తక్షణం తిగిరి పంబకు చేరుకోవడం మంచిది. జనవరి ఒకటో తేదీ నుంచి పెద్ద పాదం యాత్ర చేసే స్వాములు కలిసికట్టుగా పగటి పూటే యాత్ర చేయాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటారు కదూ. స్వామియే శరణం అయ్యప్ప.